Telugu Updates
Logo
Natyam ad

మహిళల భద్రతే షీ టీం లక్ష్యం.

మీ రక్షణ.. మా బాధ్యత

రామగుండం సిపి ఎం.శ్రీనివాస్ ఐపిఎస్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: రామగుండము పోలీస్ కమీషనరేట్ పరిదిలోని మహిళలు, బాలికల, విద్యార్థిని విద్యార్థుల భద్రతే షీ టీం లక్ష్యంగా పనిచేస్తునట్లు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్ (ఐజీ ) మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ.. పోలీస్ కమిషనరేట్ లో రెండు షీ టీం బృందాలు పని చేస్తున్నాయని షీ టీం ఆధ్వర్యంలో వివిధ ప్రదేశాలలో పాఠశాలలు కళాశాలలో  ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, పోక్సో, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, టి సేఫ్ అప్ ఆత్మహత్యలు, డ్రగ్స్ బాల్య వివాహాలు వరకట్నం చట్టాలపై, నూతన మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తునట్లు తెలిపారు. టీమ్ సభ్యులు ప్రత్యక్షంగా ఫిర్యాదులు తీసుకుంటారని, ఆన్లైన్, క్యూ ఆర్ కోడ్, వాట్సప్ ద్వారా కూడా స్వీకరిస్తారని తెలిపారు. మహిళలు, బాలికలపై ఆన్లైన్ లో అసభ్యకర పోస్టులు పెట్టే సైబర్ నేరగాళ్లపై కూడా సైబర్, షీ టీమ్ సమన్వయంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. మహిళలు బాలికలు విద్యార్థులు షీ టీం సేవలు ఉపయోగించుకోవాలని సూచించారు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని తెలిపారు. ఎవరైనా వేధించిన, రోడ్డుపై వెళ్లేటప్పుడు అవహేళనగా మాట్లాడిన, ఉద్దేశపూర్వకంగా వెంబడించిన విద్యార్థినిలు, మహిళలు అత్యవసర పరిస్థితులలో రామగుండం పోలీస్ కమిషనరేట్ షీ టీం నెంబర్ 6303923700  కి కాల్ చేసి, వాట్సాప్ ద్వారా సందేశం పంపించి లేదా డయల్ 100 కు కాల్ చేసి తక్షణ పోలీస్ సహాయం పొందాలని సీపీ సూచించారు.