Telugu Updates
Logo
Natyam ad

రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంతో ఉచిత వైద్య సదుపాయం

మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్, మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి డా|| జి.సి. సుబ్బారాయుడు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి. శేషాద్రి, మంచిర్యాల రాజస్వ మండల అధికారి రాములు, ఆర్.టి.సి. మంచిర్యాల డిపో మేనేజర్ వి. రవీంద్రనాథ్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా లబ్ధిదారులకు పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగిందని, అర్హులైన లబ్ధిదారులకు ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించడం జరుగుతుందని, అన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎంపానల్డ్ ఆసుపత్రులలో తక్షణమే అమలు చేయడం జరుగుతుందని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పథకం అమలు చేసేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్ఆర్టిసి) బస్సులలో మహిళలందరికీ ఉచిత ప్రయాణం అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులలో బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని, కండక్టర్లు జీరో టిక్కెట్ జారీ చేస్తారని తెలిపారు. మంచిర్యాల శాసనసభ్యులు మాట్లాడుతూ. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే 6 పథకాలలో భాగంగా మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లకు పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులలో ఉచిత రవాణా సౌకర్యం కల్పించడం జరుగుతుందని, బస్సులో మహిళలందరికీ కండక్టర్లు జీరో టిక్కెట్ జారీ చేస్తారని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని 10 లక్షల రూపాయలు పెంచడంతో పాటు 1 వేయి 647 వ్యాధులకు ఉచితంగా వైద్య సౌకర్యం అందించడం జరుగుతుందని, తెల్లరేషన్ కార్డు కలిగిన పేదలందరికీ ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం జెండా ఊపి బస్సును ప్రారంభించి, ఆర్.టి.సి. బస్టాండ్ నుండి బెల్లంపల్లి చౌరస్తా వరకు బస్సులో ప్రయాణం చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.