Telugu Updates
Logo
Natyam ad

వన్యప్రాణులు రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా: వన్యప్రాణులు రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తిర్యానీ ఇన్చార్జి అడవి శాఖ అధికారి సంతోష్ కుమార్ అన్నారు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలో శుక్రవారం రోజు ప్రపంచ 13వ పులుల దినోత్సవం సందర్భంగా అడవి శాఖ అధికారుల చే బైక్ ర్యాలీ నిర్వహించి మండలంలోని ఆయా పాఠశాలలో విద్యార్థులకు వన్యప్రాణుల సంరక్షణ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వన్య ప్రాణులను రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వన్య ప్రాణులను కూడా తమ పెంపుడు జంతువులుగా పరిగణించాలని కోరారు..

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఐఎఫ్ఎస్ దినేష్ కుమార్ ఆదేశాల మేరకు అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా మండలంలో అడవి శాఖ అధికారుల చే బైక్ ర్యాలీ నిర్వహించి పాఠశాలల్లోని విద్యార్థులకు అవగాహన కల్పించిన ట్లు తెలిపారు అంతరించిపోతున్న జాతుల లో పులి కూడా ఒకటని వాటిని సంరక్షించి భావితరాలకు అందించే విధంగా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడవి శాఖ అధికారులు మహేందర్, రామ్ సింగ్, అంబారావు తదితరులు పాల్గొన్నారు.