Telugu Updates
Logo
Natyam ad

నీరు రాదు.. దాహం తీరదు

మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి తాగు నీరు అందిస్తున్నామని ప్రజాప్రతినిధులు, అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో కొన్ని గ్రామాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి.

పని చేయని మిషన్ భగీరథ పథకం
ఆంజనేయులు న్యూస్, ఉట్నూరు గ్రామీణం,

ఆదిలాబాద్ జిల్లా: మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి తాగు నీరు అందిస్తున్నామని ప్రజాప్రతినిధులు, అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో కొన్ని గ్రామాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. ఏజెన్సీలోని మారుమూల గ్రామాల ప్రజలకు సరిపడా నీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉట్నూరు మండలంలోని పులిమడుగు, బాబాపూర్, నర్సాపూర్, మండలంలోని పులిమడుగు, బాబాపూర్, నర్సాపూర్, ఉట్నూరు, తేజాపూర్, హీరాపూర్, చాప్రాల, పాత ఉట్నూరు, ఘన్పూర్, వడ్గల్పూర్, శాంతాపూర్ తో పాటు పలు గ్రామాల్లో మిషన్ భగీరథ నీరు సరిపడా రావడం లేదు. మరికొన్ని గ్రామాల్లో పూర్తిగా రావడమే లేదు. నీటి సమస్యపై పలుమార్లు సంబంధిత అధికారులతో పాటు పంచాయతీ సిబ్బందికి తెలిపినా పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు.

బాబాపూర్ వాసులు బహుదూరం వెళ్లాల్సిందే….

ఉట్నూరు మండలం బాబాపూర్ లో 30 కుటుంబాలు ఉన్నాయి. 200 జనాభా నివసిస్తున్నారు. వీరి అవసరాల కోసం మిషన్ భగీరథ పథకం నీరందించేందుకు ట్యాంకు నిర్మించారు. ట్యాంకు ద్వారా నీరు అంతంత మాత్రమే సరఫరా చేస్తున్నారు. సరిపడా నీరు రాక గ్రామ పొలిమేరలో ఉన్న బోర్వెల్ వద్దకు వెళ్లి ఎడ్లబళ్లపై తెచ్చుకుంటున్నారు.

ట్యాంకరే దిక్కూ…ట్యాంకర్ ద్వారా పులిమడుగువాసులకు నీరందిస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బంది

పులిమడుగువాసుల సౌకర్యార్ధం మిషన్ భగీరథ పథకం ద్వారా మంచి నీటి ట్యాంకులు ఏర్పాటు చేశారు. వారం రోజుల నుంచి నీరు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ పంచాయతీ, భగీరథ సిబ్బందికి నీటి సమస్యను చెప్పారు. ప్రజల దాహార్తి తీర్చేందుకు పంచాయతీ ట్యాంకర్ ద్వారా నీరు అందిస్తున్నారు.

బాబాపూర్ లో పని చేయని మిషన్ భగీరథ ట్యాంకు

త్వరలో సమస్య పరిష్కరిస్తాం

-సురేందర్, ఉట్నూరు ఏఈ ఆర్ డబ్ల్యూఎస్

ఏయే గ్రామాల్లో భగీరథ పథకం నీరు సరఫరా కావడం లేదో వెంటనే సంబంధిత గ్రామాలను పరిశీలిస్తాం. త్వరలోనే నీరు అందించేలా చర్యలు తీసుకుంటాం. ప్రజలకు సరిపడా నీరు సరఫరా చేసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం.