Telugu Updates
Logo
Natyam ad

వడ్ల కొనుగోలు పేరిట రైతులకు టోకరా..!

ఆరుగాలం శ్రమించి చేతికొచ్చిన పంటను వ్యాపారికి విక్రయించగా.. అతడు రైతులను మోసం చేసిన సంఘటన మంచిర్యాల, కుమురం భీం జిల్లాల పరిధిలో వెలుగుచూసింది.

తాండూరు సర్కిల్ కార్యాలయంలో సీఐతో మాట్లాడుతున్న రైతులు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ఆరుగాలం శ్రమించి చేతికొచ్చిన పంటను వ్యాపారికి విక్రయించగా.. అతడు రైతులను మోసం చేసిన సంఘటన మంచిర్యాల, కుమురం భీం జిల్లాల పరిధిలో వెలుగుచూసింది. వ్యాపారి చుట్టూ తిరిగి వెళ్లిపోయిన రైతులకిక్కిరిసిపోయింది  దిక్కుతోచని స్థితిలో ఆయా మండలాల పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదులు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని పెర్కపల్లి గ్రామానికి చెందిన నల్ల రమేష్ అనే వ్యక్తి రెండేళ్లుగా రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేసే వ్యాపారం చేస్తున్నాడు. ఇటీవల కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలోని రెబ్బెన, గోలేటి, తక్కళ్లపల్లి, మంచిర్యాల జిల్లా పరిధిలోని తాండూరు, కన్నెపల్లి, భీమిని మండలాల్లోని రైతుల నుంచి వడ్లను కొనుగోలు చేశాడు. మొదట్లో కొంత మంది రైతులకు 25 శాతం డబ్బులు ఇచ్చాడు. మూడు నెలలు కావస్తున్నా మిగతా రైతులకు డబ్బులు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. రెండు జిల్లా పరిధిలో మొత్తంగా సుమారు రూ.3 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సి ఉందని బాధితులు వాపోతున్నారు. దీంతో రెండు జిల్లాల రైతులు ఆయా మండలాల పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదులు చేస్తున్నారు. సుమారు 100 మంది రైతులు శుక్రవారం తాండూరు సర్కిల్ కార్యాలయానికి ఫిర్యాదు చేసేందుకు  ఈ మోసం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. బాధిరావడంతోతులు రెబ్బెన, కన్నెపల్లి, తాండూరు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. రమేష్ ను అదుపులోకి తీసుకొని తమకు న్యాయం చేయాలని బాధిత రైతులు కోరారు.

• ఇద్దరు వ్యాపారులపై కేసు.

రెబ్బెన మండలంలోని పలువురు రైతుల నుంచి వరిధాన్యం కొనుగోలు చేసి డబ్బులు చెల్లించని వ్యాపారులపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై భూమేష్ తెలిపారు. తాండూరు మండలం ద్వారక కాసిపేటకు చెందిన నల్లూరి రమేష్, సాంబయ్య వరి ధాన్యం వ్యాపారం చేస్తుంటారన్నారు. ఇటీవల పలువురు రైతుల నుంచి సుమారు రూ. 9.25 లక్షల విలువ చేసే ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 50 రోజుల్లో డబ్బులు చెల్లిస్తామని చెప్పిన వ్యాపారులు గడువు పూర్తయిన చెల్లించకుండా తప్పించుకొని తిరుగుతున్నట్లు ఫిర్యాదు వచ్చిందన్నారు.