Telugu Updates
Logo
Natyam ad

పూల పండుగతో ప్రజలందరి కుటుంబాలలో సంతోషం

మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగులు, స్వయం సహాయక సంఘాల సభ్యులతో ఏర్పాటు చేసిన నాన బియ్యం బతుకమ్మ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మహిళలతో బతుకమ్మ ఆడారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. బతుకమ్మ పండుగలో భాగంగా సద్దుల బతుకమ్మ వరకు ప్రతి రోజు ఒక ప్రత్యేకమైన రోజుగా ఉంటుందని, ఈ కార్యక్రమాలలో అన్ని ప్రభుత్వ శాఖలలో మహిళా ఉద్యోగులు, మహిళా ప్రజాప్రతినిధులతో కార్యచరణ రూపొందించడం జరిగిందని, ఈ మేరకు అందరు స్వచ్ఛందంగా పాల్గొని బతుకమ్మ పండుగను విజయవంతం చేయాలని తెలిపారు. పూలనే దేవతగా పూజించే సంస్కృతి తెలంగాణ రాష్ట్రంలోనే ఉందని, ఈ బతుకమ్మ పండుగ దేశంలోనే కాకుండా విదేశాలలో సైతం ప్రత్యేక స్థానం సంపాదించుకుందని, మానవాళిని ప్రకృతికి దగ్గర చేసే కార్యక్రమంగా వర్ణించవచ్చని తెలిపారు.

కరోనా తరువాత అందరం కలిసి జరుపుకుంటున్న ఈ పండుగతో అందరి కుటుంబాలలో సంతోషం నిండాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి. శేషాద్రి, సంబంధిత అధికారులు, మహిళా ఉద్యోగులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.