Telugu Updates
Logo
Natyam ad

తాండూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శన

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజు

ఆంజనేయులు న్యూస్, తాండూర్: మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజు ఆకస్మికంగా సందర్శించారు.. ఈ సందర్భంగా డాక్టర్ హరీష్ రాజు మాట్లాడుతూ… ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలు చేయించాలని సమయపాలన పాటించాలని వాతావరణ మార్పులతో కీటికజనిత వ్యాధులు మలేరియా డెంగ్యూ ఇలాంటి వ్యాధులు ప్రబలకుండా ప్రభావిత గ్రామాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని గ్రామపంచాయతీ మునిసిపల్ సిబ్బంది సహకారంతో గ్రామాలలో దోమలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఇంటిలో ఇంటి పరిసరాలలో నీరు నిలవ లేకుండా చేయాలని ప్రతివారం డ్రైడే పాటించాలని డెంగ్యూ పైన ప్రైవేట్ ఆస్పత్రులు ఎలాంటి భయంతో గురి చేయరాదని డెంగు నిర్ధారణ కొరకు టీ హబుకు శాంపిల్స్ పంపాలని కోరడమైనది అదేవిధంగా వైద్యాధికారి రోజువారీగా సిబ్బందితో సమీక్ష చేసుకోవాలని సూపర్వైజర్లకు ఉపకేంద్రములను పర్యవేక్షణ కోసం కేటాయించాలని అలాగే గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కళాజాత ద్వారా ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ ఝాన్సీ, బెల్లంపల్లి వైద్యాధికారి, సూపర్వైజర్లు వెంకట సాయి, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.