Telugu Updates
Logo
Natyam ad

శ్రీ చైతన్య పాఠశాలలో వన మహోత్సవం

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవం కార్యక్రమం పురస్కరించుకొని గురువారం మంచిర్యాల పట్టణంలో గల శ్రీ చైతన్య పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు జోబియన్ ఆధ్వర్యంలో స్మార్ట్ లీవింగ్ ప్రోగ్రాంలో భాగంగా వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి మంచిర్యాల పట్టణ సీఐ బన్సీలాల్ తో  కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. భూ మండలంలోని సమస్త ప్రాణుల జీవన మనుగడకు చెట్లే ఆధారం అన్నారు. భవిష్యత్ తరాలకు ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే మనిషికి ఒక మొక్క నాటడంతో పాటు మొక్కలను సంరక్షిస్తూ పెంపకాల బాధ్యతలను తీసుకోవాలన్నారు. ప్రజల మనుగడకు చెట్లు ఉండాలని పండ్ల చెట్లు, వేప చెట్లు ఎక్కువగా పెంచేలా చూడాలన్నారు. ప్రతి ఒకరు మొక్కలు నాటాలని తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని ఇంత ఘణంగా నిర్వహంచినందుకు పాఠనాల చైర్మైన్ శ్రీధర్, డైరక్టర్ శ్రీవిధ్య, ఎజిఎం రాజు, కో- ఆర్డినెటర్. నాగరాజులు అభినందించారు. ఈ కార్యక్రమంలో డీన్. రాజ్ కుమార్, A.O బిలాస్, జోనల్ ఇంచార్జి రాజేందర్, పిఈటిలు, ఉపాధ్యాములు పాల్గొన్నారు.