Telugu Updates
Logo
Natyam ad

మహాత్మా గాంధీని అవమానపరిచిన వారిని శిక్షించాలి.

వైశ్య సంఘాల ఆధ్వర్యంలో గాంధీజీ విగ్రహానికి పాలాభిషేకం

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జాతిపిత మహాత్మా గాంధీని కలకత్తాలో అవమానపరిచినందుకు నిరసనగా మహాత్మా గాంధీ విగ్రహానికి మంచిర్యాల జిల్లా మహాసభ‌ మంచిర్యాల పట్టణ ఆర్యవైశ్య సంఘం, వాసవి ఆర్యవైశ్య యువజన సంఘం, మంచిర్యాల ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం, మంచిర్యాల పట్టణ మహిళా విభాగం, మంచిర్యాల వాసవి క్లబ్స్, అవొపా  ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. స్థానిక గాంధీ పార్క్ లో మంగళవారం మహాత్ముని విగ్రహానికి పాలాభిషేకం చేసిన అనంతరం ఆర్యవైశ్య సంఘాల నాయకులు మాట్లాడుతూ, జాతిపిత మహాత్మా గాంధీని నైరుతి కోల్కత్తాలోని రూబీ క్రాసింగ్ దగ్గర అఖిల భారత హిందూ మహాసభ పేరిట ఏర్పాటు చేసిన మండపంలో దుర్గామాత విగ్రహం వద్ద మహిషాసురుని స్థానంలో మహాత్ముని పోలిన బొమ్మను ఉంచడం సరికాదని పేర్కొన్నారు. మహాత్ముని చిత్రపటం ఏర్పాటు చేయడం వల్ల ఈ యావత్ దేశాన్ని అవమానపరిచినట్లు అవుతుందని ఈ ఘటనకు పాల్పడిన దుండగులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ గౌరవాధ్యక్షుడు ముక్త శ్రీనివాస్, ఆవోప రాష్ట్ర అదనపు కార్యదర్శి సిరిపురం శ్రీనివాస్, కౌన్సిలర్లు మాదంశెట్టి సత్యనారాయణ, కొండ చంద్రశేఖర్, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు దొంతుల ముఖేష్ ,వాసవి ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు కంభంపాటి కమలాకర్ , వాసవి క్లబ్ అధ్యక్షుడు కేశెట్టి వంశీకృష్ణ , ఆవోపా అధ్యక్షుడు సాయిని సత్యనారాయణ తోపాటు వైశ్య సంఘాలు‌, వాసవి క్లబ్స్, ఆవోపా నాయకులు పాల్గొన్నారు.