Telugu Updates
Logo
Natyam ad

తరుగు పేరుతో రైతులను దోచుకుంటున్న మిల్లర్లు

ఆంజనేయులు న్యూస్, పెద్దపల్లి జిల్లా: రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర నాయకులు గుజ్జుల రామక్రిష్ణారెడ్డి విమర్షించారు. సోమవారం పెద్దపల్లిలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గత 50 రోజులుగా కొనుగోలు సెంటర్లలో ధాన్యం నిల్వలు ఉన్నప్పటికీ ప్రభుత్వం కొనుగోలు చేయకుండా, రైతులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. ప్రభుత్వ అసమర్థతో రూ. 1600కే క్వింటాల్ చొప్పును దళారులకు రైతులు అమ్ముకునే దౌర్భాగ్య పరిస్థితి నెలకొందన్నారు. తాలు పేరుతో బస్తాకు నాలుగు కిలోల మేర దాన్యం కోత విధించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. కోతల పేరుతో ఇప్పటి వరకు జిల్లాలో రూ. 23 కోట్ల మేర మిల్లర్లు దోచుకున్నారని తెలిపారు. తాలు  పేరుతో దోచుకున్న మిల్లర్లను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. మరోవైపు దాన్యం తరలించే లారీలను కూడా సమకూర్చలేక ముఖ్య మంత్రి కేసిఆర్ చేతులెత్తేశాడన్నారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం కింద ఇస్తానని ప్రకటించిన రూ. 280 కోట్ల నిధులను వెంటనే విడుదల చేసి, రైతులకు అందించాలని డిమాండ్ చేశారు. అలాగే మంగళవారం పెద్దపల్లి కలెక్టరేట్ ముందు కలెక్టరేట్ ముందు చేపట్టనున్న కిసాన్ మహాధర్నా ఆందోళనకు రైతులు, ప్రజలు, యువత తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ జిల్లా అధ్యక్షుడు మీస అర్జున్ రావు, రాష్ట్ర నాయకులు కౌశిక్ హరి, సీనియర్ నాయకులు ఠాకూర్ రాంసింగ్, పిన్నింటి రాజు, పర్స సమ్మయ్య, పెండ్యాల రమేష్, ఆది కేశవరావు, పుట్ట రవి, పెండ్యాల కుమార్, ఎండి ఫహీం, సంపత్ రెడ్డి, గోగూరి రవీందర్ రెడ్డి, రామన్న పాల్గొన్నారు..