Telugu Updates
Logo
Natyam ad

ఇక నుండి ATM లో రేషన్ బియ్యం

అక్రమ రేషన్ రవాణాకు అడ్డుకట్ట

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: ఏటీఎం నుంచి నగదు డబ్బులు తీసుకోవటం మీరు చూసి ఉంటారు. కానీ, ఇప్పుడు ఏటీఎం నుంచి రేషన్ బియ్యం కూడా తీసుకోవచ్చు.? ఇందుకు సంబంధించి దేశంలోనే తొలి బియ్యం ఏటీఎం మిషన్ ప్రారంభమైంది. ఒడిశాలో ఏర్పాటు చేసిన ఈ ఏటీఎం మిషన్ నుంచి బియ్యాన్ని తీసుకోవచ్చు. వినడానికి వింతగా అనిపించినా ఇది నిజం. ఒడిశా ప్రభుత్వం భువనేశ్వర్ లోని ముంచేశ్వర్ ప్రాంతంలోని గోదాములో ఈ నూతన బియ్యం ఏటీఎంను ప్రారంభించింది. రేషన్ లబ్ధిదారులు తమ రేషన్ కార్డు నెంబర్ ను బియ్యం ఏటీఎం స్కీరన్ పై నమోదు చేయాలి. ఆ తరువాత వేలిముంద్ర వేయాల్సి ఉంటుంది. ఆ తరువాత ఏటీఎం నుంచి వచ్చే బియ్యాన్ని బస్తాలో నింపుకోవచ్చు. ప్రతీ రేషన్ కార్డు లబ్ధిదారుడు ఏటీఎం ద్వారా ఒకేసారి 25 కిలోల బియ్యాన్ని పొందవచ్చు. ఈ విధానం ద్వారా బియ్యం కోసం రేషన్ దుకాణాల ముందు గంటల తరబడి నిలబడాల్సిన అవసరం ఉండదు. అంతేకాక అక్రమ రవాణాకు పూర్తిగా అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది. ప్రయోగాత్మకంగా భువనేశ్వర్ లో ఈ బియ్యం ఏటీఎంను ప్రారంభించారు. ఒడిశాలోని మొత్తం 30 జిల్లాల్లో ఈ రేషన్ బియ్యం ఏటీఎంలను తెరిచే యోచన లో ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం ఈ మోడల్ విజయవంతం అయితే.. రేషన్ కార్డు పథకం కింద ఇతర రాష్ట్రాలకు ఈ విధానం విస్తరించనుంది.