Telugu Updates
Logo
Natyam ad

ప్రజాపాలన కు పాలభిషేకం

కళాకారుల బ్రతుకుల్లో వెలుగులు

తెలంగాణ సాంస్కృతిక సారధి మంచిర్యాల

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: పీఆర్సీ జీతాలు పెంపుతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సాంస్కృతిక శాఖ మాత్యులు జూపల్లి కృష్ణారావు, చిత్రపటాలకు గురువారం తెలంగాణ సాంస్కృతిక సారధి మంచిర్యాల జిల్లా కళాకారుల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో పాలాభిషేకం చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన 583 మంది కళాకారులను గత ప్రభుత్వం గుర్తించి ఉద్యోగాలు ఇచ్చి వారికి సముచిత స్థానం కల్పించడం జరిగిందన్నారు. గత 10 సంవత్సరాలుగా రూ.24,514 జీతం ఇవ్వడంతో పాటు పీఆర్సీని పెంచాలంటూ జీవోను విడుదల చేయడం జరిగిందని చెప్పారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.24,514 నుండి రూ.31,868 కి పెంచుతు నిన్న రెండు నెలల జీతం ఒకేసారి వేసి, కళాకారులకు కొండంత అండగా నిలిచారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పలు సంక్షేమ పథకాలపై ప్రత్యేక గీతాలను రూపొందించి, ఆటపాటలతో గ్రామాలలో ప్రదర్శిస్తూ ప్రజలకు వివరించడం జరుగుతుందన్నారు. తమ బతుకుల్లో వెలుగులు నింపిన రేవంత్ సర్కారుకు జీవితాంతం రుణపడి ఉంటామని సారథి కళాకారులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కళాకారులు లావుడ్యా రమేష్, ముల్కల్లా మురళి, మామిళ్ల లచన్న, వెళ్తూరు పోశం, కొప్పర్తి రవీందర్, గొడిసేలా కృష్ణ, వాడకపురమ్ రవికుమర్, దయ సుధాకర్,  శ్రీనివాస్, కృష్ణ, సమీరా, సంధ్య, నిరోషా, తిరుపతి రామాటెంకీ, సంతోష్, రాజేష్, నాగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.