Telugu Updates
Logo
Natyam ad

ప్రజలకు అందుబాటు లో ఆసుపత్రి నిర్మించాలి

మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ సాగర్ రావు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాలలో మెడికల్ కళాశాల, జనరల్ ఆసుపత్రి ప్రజలకు అందుబాటు ఉన్న స్థలంలో నిర్మించాలని మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ సాగరరావు డిమాండ్ చేశారు. గురువారం అయన తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… సాయి కుంటలో ముంపు ప్రాంతంలో ఆస్పత్రి,మెడికల్ కాలేజీ నిర్మించాలను కోవడం తగదని సూచించారు. ముంపు ప్రాంతాల్లో ప్రజాహిత భవనాలు నిర్మించడం శ్రేయస్కరం కాదని ఆయన అన్నారు. ఎమ్మెల్యే దివాకర్ రావు ముంపు ప్రాంతాల్లోనే ఎందుకు భవనాలు నిర్మిస్తున్నాడని ఆయన ప్రశ్నించారు. మంచిర్యాలలోని ఐటిఐ, మార్కెట్ కమిటీ స్థలాలతో పాటు గుడిపేటలో ప్రభుత్వ స్థలం ఉండగా గోదావరి ముంపు ప్రాంతంలొనే భవనాలను నిర్మించాలనుకోవడం లో ఆంతర్యం ఏమిటని ఆయన నిలదీశారు. అలాగే గూడెం ఎత్తిపోతల పథకం రైతులకు ఏమాత్రం ప్రయోజనకరంగా లేదని ఆయన మండిపడ్డారు. రైతులకు సాగునీరు అందడం లేదని ఆయన మదనపడ్డారు. శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి లేదా కడెం ప్రాజెక్టు నుంచి 42 డిస్ట్రిబ్యూటర్ వరకు సాగునీరు అందించాలని లేకపోతే రైతులతో ఉద్యమం చేపడుతామని ఆయన హెచ్చరించారు.

ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ పట్టణ అధ్యక్షులు తూముల నరేష్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, పీసీసీ సభ్యులు కొండ చంద్ర శేఖర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పుదరి తిరుపతి, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.