Telugu Updates
Logo
Natyam ad

ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 69వ జన్మదిన వేడుకలు జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 69వ జన్మదిన వేడుకల సందర్భంగా గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక మిమ్స్ జూనియర్ కళాశాల ప్రాంగణంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు కేసీఆర్ పుట్టిన రోజు ను కళాశాల విద్యార్థుల మధ్యన ఆనందోత్సాహాలతో  కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. జన్మదిన వేడుకలు సందర్భంగా జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం. కేసీఆర్ జిల్లా స్థాయి మహిళా చదరంగం చాంపియన్ షిప్ పోటీల కార్యక్రమానికి ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన అవిరళ కృషి, ముఖ్యమంత్రిగా ఎదిగిన నేపథ్యం, ఆయన గొప్పదనం, ముఖ్యమంత్రిగా చేస్తున్న పలు అభివృద్ధి పథకాలను మరియు దేశ నిర్మాణంలో కేసీఆర్ ఆలోచన విధానాలను  తెలుపుతూ కెసిఆర్ దేశానికి ఆదర్శమైన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. అనంతరం చదరంగం పోటీలను మహిళలతో కలిసి ఆడి ప్రారంభించారు. కార్యక్రమానికి ముందు ముఖ్యమంత్రి జన్మదిన సందర్భంగా “పర్యావరణ పరిరక్షణలో.. తెలంగానాకు హరితహారం” అంశంలో గుండేటి యోగేశ్వర్ అవగాహన కలిగించారు. ఈ సందర్భగా సీఎం కేసీఆర్ పై చేసిన కవితా గానం ఆకట్టుకుంది. అనంతరం జిల్లాస్థాయి చదరంగం పోటీలలో ప్రథమ స్థానంలో ఎం..అశ్రీత మంచిర్యాల, ద్వితీయ కె.శ్రీజ భీమారం, తృతీయ స్థానంలో కె. శ్రీమనోగ్య నస్పూర్  ఎంపికయ్యారని జన్మదిన సందర్భంగా శుక్రవారం హైదరాబాదులోని ఎల్. బి స్టేడియం లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో మంచిర్యాల జిల్లా నుంచి పాల్గొంటారని డి.వైస్.ఎస్ ఓ బొబ్బిలి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. విజేతలకు ఎమ్మెల్యే దివాకర్ రావు బహుమతులు మెడల్స్ ని ప్రధానం చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ చైర్మన్ పెంట రాజయ్య, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ భూమేష్, వార్డ్ కౌన్సిలర్ రవీందర్ రావు, డి వై .ఎస్. ఓ బొబ్బిలి  శ్రీకాంత్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈ.డీ దుర్గాప్రసాద్, కార్యక్రమ సమన్వయకర్త గుండేటి యోగేశ్వర్, కళాశాల రెస్పాండెంట్ శ్రీనివాసరాజు, సీనియర్ కోచ్ పి.డి  సుకుమార్ ఫ్యాన్సిస్, ఎర్రవేని తిరుపతి కళాశాల విద్యార్థులు, ప్రజలు, అధికారులు పాల్గొన్నారు.