Telugu Updates
Logo
Natyam ad

రాష్ట్రపతి పాదాలు తాకేందుకు యత్నం.. మహిళా ఇంజినీర్ సస్పెన్షన్

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాదాలు తాకేందుకు ప్రయత్నించిన ఓ మహిళా ఇంజినీర్ సస్పెన్షన్ కు గురయ్యారు. జనవరి 3, 4 తేదీల్లో రాష్ట్రపతి రాజస్థాన్ లో పర్యటించారు.

ఆంజనేయులు న్యూస్, దిల్లీ: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాదాలు తాకేందుకు ప్రయత్నించిన ఓ మహిళా ఇంజినీర్ సస్పెన్షన్ కు గురయ్యారు. జనవరి 3, 4 తేదీల్లో రాష్ట్రపతి రాజస్థాన్ లో పర్యటించారు. అందులో భాగంగా రోహెత్ లోనీ స్కౌట్ గైడ్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజారోగ్య విభాగంలో ఇంజినీర్ బాధ్యతలు నిర్వర్తిస్తోన్న అంబా సియోల్.. సభా ప్రాంగణంలో నీళ్లను అందించే బాధ్యతలు చూస్తున్నారు. రాష్ట్రపతి ఆ ప్రాంగణానికి చేరుకున్న సమయంలో స్వాగతం పలికేందుకు అధికారులు వేచి చూస్తున్నారు. రాష్ట్రపతి చేరుకోగానే.. ప్రొటోకాల్ ఉల్లంఘించి అడుగు ముందుకేసిన ఆ అధికారిణి రాష్ట్రపతి పాదాలకు నమస్కరించేందుకు యత్నించారు. అక్కడున్న రాష్ట్రపతి వ్యక్తిగత సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కేంద్ర హోంశాఖ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదికను కోరింది. దీనిపై చర్యలు చేపట్టిన రాజస్థాన్ ప్రభుత్వం.. ఆ ఇంజినీర్ ను సస్పెండ్ చేసింది.