Telugu Updates
Logo
Natyam ad

చార్జీల పేరుతో పేద ప్రజల సొమ్ము దోచుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం

బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: విద్యుత్ బిల్లుల పై రాష్ట్ర ప్రభుత్వం ఎసిడి ఛార్జీలు వసూలు చేసి పేద ప్రజల సొమ్మును దోపిడీ చేయడాన్ని నిరసిస్తూ ఎసిడి చార్జీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బిజెపి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, నాయకులు మరియు కార్యకర్తలు మంచిర్యాల పట్టణంలోని బెల్లంపల్లి చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. శాంతియుతంగా నిరసన చేస్తున్న రఘునాథ్ ను మరియు బిజెపి నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ.. ఎసిడి చార్జీల పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కష్టాన్ని దోచుకుంటుంది అని అన్నారు. పేద ప్రజలకు న్యాయం చేయాలని పోరాటం చేస్తున్న బిజెపి నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం ఈ రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనం అని అన్నారు. ఈ రాష్ట్రంలో నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది అని అన్నారు. గతంలో డెవలప్మెంట్ చార్జీల పేరుతో వేల రూపాయల బిల్లులు వసూలు చేసి ఇప్పుడు మళ్లీ ఎసిడి ఛార్జీలు పేరుతో మరొక సారి ఈ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల రక్తాన్ని దోపిడీ చేస్తుంది అని అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలకు బకాయిలు చెల్లించకపోవడంతో విద్యుత్ సంస్థలు పేద ప్రజల డబ్బును దొచుకంటుంది అని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎసిడి చార్జీలను రద్దు చేయాలని అదే విధంగా పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పేద ప్రజల పక్షాన ఛార్జీలు రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వంగపల్లి వెంకటేశ్వర్ రావు, పెద్దపల్లి పురుషోత్తం, రజినిష్ జైన్, పట్టి వెంకట కృష్ణ, జోగుల శ్రీదేవి, ముదామ్ మల్లేష్, లక్ష్మి నారాయణ, రాజబాబు, బల్ల రమేష్, పల్లి రాకేష్, రెడ్డిమల్ల అశోక్, రాకేష్ రెన్వ, నాగుల రాజన్న, పచ్చ వెంకటేశ్వర్లు, హేమంత్ రెడ్డి, శరత్, వినోద్, చక్రి, లావణ్య, రయెల్లి మల్లేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.