Telugu Updates
Logo
Natyam ad

పోలీస్ కమిషనరేట్ లో ఘనంగా ఆచార్య జయశంకర్ జయంతి

అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి.రాజు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: రామగుండం పోలీసు కమీషనరేట్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన రామగుండం అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి.రాజు. ఈ సందర్భంగా అడ్మిన్ సి.రాజు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను యావత్ ప్రపంచానికి చాటి చెప్పి ప్రత్యేక రాష్ట్ర సాధనకు జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అని సిద్ధాంతకర్తగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం తన జీవిత కాలం రాష్ట్ర సాధనకే త్యాగం చేసిన మహనీయుడని కొనియాడారు. తెలంగాణ ఏర్పాటు కోసం ఎన్నో ఉద్యమాలు 1969 తెలంగాణ ఉద్యమం, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, నాన్ ముల్కీ ఉద్యమం, మలిదశ తెలంగాణా ఉద్యమం లో పాల్గొని దేశ వ్యాప్తంగా వేదికల ద్వారా తన ప్రసంగాలతో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి తెలియజేశారు అని తెలిపారు. ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పి ఉద్యమ స్ఫూర్తితో ప్రజలను చైతన్యం చేసిన గొప్ప వ్యక్తి అని అన్నారు. ఆయన జీవితం నేటి యువ‌త‌కు ఆద‌ర్శప్రాయం, స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన స్పూర్తితో ప్రజలకు పోలీస్ శాఖ ద్వారా మరింత మెరుగైన సేవలందించి ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. అనంతరం డీసీపీ అడ్మిన్ సిబ్బంది కి స్వీట్స్ పంచిపెట్టారు.. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసిపి రాఘవేంద్రరావు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఏఓ అశోక్ కుమార్, పిసిఅర్ ఇన్స్పెక్టర్ రవీందర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు  దామోదర్, మల్లేషం, సూపరింటెండెంట్ లు ఇంద్ర సేనా రెడ్డి, సంధ్య, మనోజ్ కుమార్, సిపిఓ సిబ్బంది, వింగ్స్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.