Telugu Updates
Logo
Natyam ad

ప్లాస్టిక్, పాలిథిన్ సంచులు వాడితే భారీగా జరిమానా

మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో నిషేధిత ప్లాస్టిక్ లేదా పాలిథిన్ సంచులు వాడితే భారీగా జరిమానా విధిస్తామని మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్ తెలిపారు. హోల్ సేల్, రిటైల్ వ్యాపారుల దగ్గర పాలిథిన్ సంచులు ఉంటే వెంటనే ఆయా కంపెనీలకు తిరిగి అప్పగించాలని సూచించారు. ప్రత్యేక బృందాలతో తాము చేపట్టే తనిఖీల్లో ప్లాస్టిక్, పాలిథిన్ సంచులు లభిస్తే జరిమానాతో పాటు శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.