Telugu Updates
Logo
Natyam ad

ఫోటో ఓటరు తుది జాబితా విడుదల

జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ఫోటో ఓటరు జాబితా సవరణ కార్యక్రమం -2024 లో భాగంగా ఓటరు జాబితా రూపకల్పన ప్రక్రియలో తుది జాబితా విడుదల చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరి వివరాలు ఓటరు జాబితాలో నమోదు చేయడం జరిగిందని, దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్ ల నుండి దరఖాస్తులు స్వీకరించి నూతన ఓటరు జాబితా రూపొందించడం జరిగిందని తెలిపారు. జాబితాలో మార్పులు, సవరణలు, తొలగింపుల కొరకు అందిన దరఖాస్తులను భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పరిశీలించి తుది జాబితా తయారు చేయడం జరిగిందని తెలిపారు. 002-చెన్నూర్ (ఎస్. సి.) నియోజకవర్గంలో 95 వేల 974 మంది పురుషులు, 97 వేల 264 మంది స్త్రీలు, 7 మంది ట్రాన్స్ జెండర్లు, 7 మంది ఎన్.ఆర్.ఐ., 134 మంది సర్వీస్ ఓటర్లు, 003-బెల్లంపల్లి (ఎస్. సి.) నియోజకవర్గంలో 86 వేల 802 మంది పురుషులు, 88 వేల 530 మంది స్త్రీలు, 13 మంది ట్రాన్స్ జెండర్లు, 2 మంది ఎన్ఆర్ఐ లు, 162 మంది సర్వీస్ ఓటర్లు, 004-మంచిర్యాల నియోజకవర్గంలో 1 లక్షా 38 వేల 472 మంది పురుషులు, 1 లక్షా 40 వేల 559 మంది స్త్రీలు, 25 మంది ట్రాన్స్ జెండర్లు, 27 మంది ఎన్ ఆర్ ఐ లు, 335 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారని, మొత్తం జిల్లా వ్యాప్తంగా 3 లక్షల 21 వేల 248 మంది పురుషులు, 3 లక్షల 26 వేల 353 మంది స్త్రీలు, 45 మంది ట్రాన్స్ జెండర్లు, 36 మంది ఎన్ ఆర్ ఐ లు, 631 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారని తెలిపారు.