Telugu Updates
Logo
Natyam ad

వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతతో వ్యాధుల నియంత్రణ

మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రతి ఒక్కరు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధులను నియంత్రించవచ్చని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినం సందర్భంగా విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని మంచిర్యాల శాసన సభ్యులు నడిపెల్లి దివాకర్రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.

జిల్లా వ్యాప్తంగా 1-19 సంవత్సరాల వయస్సు గల పిల్లలు 2 లక్షల మంది ఉన్నారని, వారందరికి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, వసతిగృహాలు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఎవరికైనా మాత్ర అందకపోతే ఈ నెల 22వ తేదీన మాత్రల పంపిణీ ఉంటుందని, ప్రతి ఒక్కరికి ఈ మాత్రను తప్పనిసరిగా తినిపించే విధంగా సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. 1-2 సంవత్సరాల వారికి అరమాత్ర, 2-19 సంవత్సరాల వారికి ఒక మాత్రను అందించి నేరుగా మింగకుండా చప్పరించడం, నమిలి మింగే విధంగా అవగాహన కల్పించాలని తెలిపారు. భోజనానికి ముందు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలని, వ్యక్తిగతంగా పరిశుభ్రతను పాటించడంతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరం సమిష్టిగా కృషి చేస్తేనే సాధ్యమవుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా॥ సుబ్బారాయుడు, ఉప వైద్యాధికారి విజయ నిర్మల, ప్రోగ్రాం అధికారి డా॥ నీరజ, మున్సిపల్ వైన్ చైర్మన్ గాజుల ముఖేశ్ గౌడ్, పి.ఎ.సి.ఎన్. చైర్మన్ నందెల వెంకటేశ్, కౌన్సిలర్ గాదె నత్యం, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శారద, హెచ్.ఈ.ఓ. నాందేవ్, హెల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీనివాస్, వైద్యులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.