Telugu Updates
Logo
Natyam ad

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నీటి విడుదల

రాష్ట్ర ఐ.టి. పరిశ్రమలు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రస్తుత భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని హాజీపూర్ మండలంలో గల శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి చేరుతున్న వరదనీటిని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దిగువ ప్రాంతాలకు ప్రణాళికబద్దంగా విడుదల చేయడం జరుగుతుందని రాష్ట్ర ఐ.టి., పరిశ్రమలు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం రామగుండం కమీషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాసులు, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు కుమార్ దీపక్, కోయ శ్రీహర్ష, రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ లతో కలిసి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి చేరుతున్న వరద నీటి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐ.టి., పరిశ్రమలు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి మాట్లాడుతూ. భారీ వర్షాల నేపథ్యంలో నెలకొన్న వరద పరిస్థితులకు ప్రజలు భయాందోళన చెందవలసిన అవసరం లేదని, అధికార యంత్రాంగం ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అత్యవసర సేవలు అందిస్తుందని తెలిపారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు సామర్థ్యం 20 టి.ఎం.సి. కాగా ఇప్పటి వరకు 14.7 టి.ఎం.సి. నీరు ఉందని తెలిపారు. గోదావరి నది పరివాహక ప్రాంతాలలోని ప్రజలకు వరద నీటి కారణంగా ఇబ్బందులు ఏర్పడకుండా దిగువ ప్రాంతాలకు ప్రాజెక్టు నుండి ప్రణాళిక ప్రకారంగా వరద నీటిని విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు.

ప్రజల సౌకర్యార్థం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయాలలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగిందని, అత్యవసర సేవల నిమిత్తం ప్రజలు సంప్రదించవచ్చని తెలిపారు. ప్రజా సంక్షేమంలో భాగంగా అధికారులు చేపడుతున్న రక్షణా చర్యలకు ప్రజాప్రతినిధులు పూర్తిగా సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్, డి.సి.పి. భాస్కర్, మంచిర్యాల, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారులు వి.రాములు, హరికృష్ణ, ఎ.సి.పి. ప్రకాష్, హాజీపూర్ మండల తహశిల్దార్ శ్రీనివాస్ దేశ్పాండే, సహాయ ఇంజనీర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.