Telugu Updates
Logo
Natyam ad

బాధాకరమైన అనుభవం.. చాకచక్యంగా రక్షించుకున్నా! స్మితా సభర్వాల్

ఇంట్లోకి డిప్యూటీ తహసీల్దార్ చొరబాటుపై స్పందించిన స్మితా సభర్వాల్

ఇంట్లోకి డిప్యూటీ తహసీల్దార్ చొరబాటు ఘటనపై ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ స్పందించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: తన ఇంట్లోకి డిప్యూటీ తహసీల్దార్ చొరబాటు ఘటనపై ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ స్పందించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. “అర్ధరాత్రి బాధాకరమైన అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి నా ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డాడు. ధైర్యం, చాకచక్యంతో నన్ను నేను రక్షించుకోగలిగాను. ఎంత భద్రత ఉన్నా.. మనల్ని మనం కాపాడుకునేలా ఉండాలి. రాత్రివేళ తలుపులు, తాళాలను స్వయంగా పరిశీలించుకోవాలి. అత్యవసర స్థితిలో డయల్ 100కు ఫోన్ చేయాలి” అని ట్వీట్ లో స్మితా సభర్వాల్ పేర్కొన్నారు.
స్మితా సభర్వాల్ ఇంట్లోకి అర్ధరాత్రి సమయంలో ఓ డిప్యూటీ తహసీల్దార్ చొరబడటం తీవ్ర కలకలం రేపింది. ఉద్యోగం విషయం మాట్లాడేందుకు అంటూ ఇంట్లోకి ప్రవేశించిన అతడిని చూసి సదరు అధికారిణి కేకలు వేయడం.. అప్రమత్తమైన భద్రతాసిబ్బంది. అతడిని పట్టుకోవడం.. అతడితో పాటు వచ్చిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం లాంటి పరిణామాలు వెంటవెంటనే జరిగిపోయాయి. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనను పోలీసులు అత్యంత రహస్యంగా ఉంచారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతంలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఈ ఘటన చోటుచేసుకుంది.