Telugu Updates
Logo
Natyam ad

సిబ్బందికి మెమోల జారీపై కొనసాగుతున్న వివాదం

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి: పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు కార్యక్రమానికి రాలేదని మున్సిపల్ కమిషనర్ జి. గంగాధర్ తాఖీదులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. బెల్లంపల్లి మున్సిపాల్టీలో ఈ వ్యవహారం సరికొత్త వివాదానికి తెరతీసింది. పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 24న ప్రభుత్వాసుపత్రిలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ముందు నుంచే ఈ సమాచారాన్ని కమిషనర్. సంఘం వాట్సప్ గ్రూపులో అధికారులు, సిబ్బందికి అందజేశారు. కొంత మంది సిబ్బంది కార్యక్రమానికి హాజరు కాలేదు. సీనియర్ అసిస్టెంటు టి. రాజేశ్వరి, జూనియర్ అసిస్టెంట్ పున్నంచందర్, మోహన్ తో పాటు బిల్ కలెక్టర్ శ్రవణ్ కు నోటీసులను కమిషనర్ జారీ చేశారు. 24గంటల్లో వివరణ ఇవ్వాలన్నారు..

ఈ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పుట్టినరోజు వేడుకలకు సిబ్బంది హాజరుకాకపోతే నోటీసులు ఇవ్వడమేంటనే వాదనలు వినిపిస్తున్నాయి. కాగా ఈ విషయంపై కమిషనర్ జి. గంగాధర్ ను వివరణ కోరగా. పెద్ద కార్యక్రమం జరిగినప్పుడు సిబ్బంది హాజరుకాకపోతే నోటీసులు ఇవ్వడం సహజమేనన్నారు. మంత్రి పుట్టినరోజు కావడంతో, ప్రాధాన్యం ఏర్పడిందని పేర్కొన్నారు..