Telugu Updates
Logo
Natyam ad

పశువులకు లంపి స్కిన్ వ్యాది… పట్టించుకోని అధికారులు

ఆంజనేయులు న్యూస్, జగిత్యాల జిల్లా: దేశ పశుసంపద ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య లంపి స్కిన్ డిసీజ్ సోకిన పశువులు జగిత్యాల రోడ్లపై సంచరిస్తున్నాయి. జిల్లాలోని మారుమూల గ్రామాల్లో పశు వైద్య అధికారులు పశువులకు లంపి చర్మ వ్యాధి సోకకుండా గోట్ పాక్స్ టీకాలు వేస్తుండగా జిల్లా కేంద్రంలోనే పశువులకు ప్రమాదకరమైన ఈ వ్యాధి సోకడం, వ్యాధి సోకిన పశువులు రోడ్లపై సంచరించడంతో ప్రజల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేష్ క్యాంపు కార్యాలయం ఎదుట బుధవారం ఓ ఆవుకు చర్మం పై పొక్కులు కనిపించాయి. ఆవును పరిశీలించిన స్థానికులు వ్యాధి లక్షణాలు లంపి స్కిన్ వ్యాది గా కనిపిస్తున్నాయని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ మధ్య పశువుల్లో లంపి స్కిన్ వ్యాధి భయంకరమైన వ్యాధిగా గుర్తించి దేశ వ్యాప్తంగా అధికారులు అప్రమత్తం కాగా జగిత్యాలలో ఆ వ్యాధి సోకిన పశువును నిర్లక్ష్యంగా రోడ్లపై వదిలివేయడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పశువైద్య శాఖ అధికారులు ఇప్పటికైనా స్పందించి వ్యాధి సోకి రోడ్డుపై సంచరిస్తున్న పశువులను ఇతర ప్రాంతాలకు తరలించి వ్యాధి వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.