Telugu Updates
Logo
Natyam ad

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి.

ఆంజనేయులు న్యూస్, కొమరం భీం అసిఫాబాద్ జిల్లా: జిల్లాలోని జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) నాయకులు కలెక్టర్ హేమంత్ సహదేవరావు కు వినతిపత్రం ఇచ్చారు. ముందుగా నూతన కలెక్టర్ కు పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. గత కొన్నేళ్లుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నా, తమకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదని, ఇళ్లు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. అర్హులైన వారికి రెండో విడత అక్రిడేషన్ లు జారీ చేయాలని, రాష్ట్ర స్థాయి బస్ పాసులో 1/3 ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని, టోల్ గేట్లలో జర్నలిస్టులకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. అలాగే జిల్లాలోని పత్తి రైతులను ఆదుకోవాలని, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) నాయకులు కలెక్టర్ హేమంత్ సహదేవరావు కు వినతి పత్రం ఇచ్చారు. పత్తికి మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని కోరారు. ప్రారంభంలో పత్తి క్వింటాలు కు సుమారుగా రూ.10 వేలు ఉండగా, ఇపుడు గణనీయంగా తగ్గి రూ.7900కు చేరుకుందని తెలిపారు. దీనితో రైతులు గిట్టుబాటు ధర కోసం ఆందోళనలు చేశారు. రూ.10, 000 గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు జి. మహేష్, ప్రధాన కార్యదర్శి పి. రాజశేఖర్, జాతీయ కౌన్సిల్ సభ్యులు టి. సురేందర్ రావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎన్. సతీష్, కోశాధికారి కృష్ణ మోహన్ గౌడ్, రవి, జలీల్ బెగ్ పాల్గొన్నారు.