Telugu Updates
Logo
Natyam ad

జన సముద్రముగా మారిన గులాబీ వనం

గులాబీ జాతర తలపించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో

ఆంజనేయులు న్యూస్, చెన్నూర్: మంచిర్యాల జిల్లా కేంద్రం చెన్నూరు పట్టణంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చెన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్ ఆధ్వర్యంలో సోమవారం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భారీ బహిరంగ రోడ్ షో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్ ను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుతూ. చెన్నూరు నియోజకవర్గం గత పరిపాలనలో ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదని, అలనాటి నాయకులు చెన్నూరును ఒక వెనుకబడిన నియోజకవర్గంగా చులకన భావంతో చూస్తూ అభివృద్ధికి నోచుకోకుండా చేయడం జరిగిందని వాపోయారు. ఇక్కడి ప్రజలు రవాణా సౌకర్యాలు లేక,ఉండడానికి ఇండ్లు సరిగా లేక, త్రాగడానికి నీరు సరిగా లేక, ఎన్నో ఇబ్బందులకు గురికావడం గతంలో చూడడం జరిగిందని తెలియజేశారు. ఇదంతా కూడా గత ప్రభుత్వాల చేతగానితనం, ప్రజల పట్ల చులకన భావం, ఎవరు మమ్మల్ని అడిగేది అని ఒక మితిమీరిన అహంకారం భావనలతో చెన్నూరు నియోజకవర్గాన్ని ఆర్థికంగా వెనుకబడేలా చేసిందని తెలియజేశారు. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఆవిరిభవించబడిందో సీఎం కేసీఆర్ వెనుకబడిన జిల్లాలపై దృష్టి పెట్టడం జరిగిందని తెలియజేశారు. అదేవిధంగా ప్రతి వెనుకబడిన జిల్లాలలో ప్రభుత్వ యంత్రాంగాన్ని, నియోజకవర్గపు ఎమ్మెల్యేలకు అన్ని రకాల బాధ్యతలు అప్పగించి ప్రజలకు నేనున్నాను అని ఒక బలాన్ని ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఎప్పుడైతే బాల్క సుమన్ ఎమ్మెల్యేగా  బాధ్యతలు చేపట్టినప్పటి నుండి చెన్నూరు నియోజకవర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాడని తెలిపారు. అందుకే ప్రజలారా ఇలాంటి నాయకుడు మళ్ళీ మళ్ళీ దొరకరు, ఎక్కడ ఉండరు అని ప్రజలకు గుర్తు చేశారు. నేను గతంలో చూసిన చెన్నూరుకు ఇప్పుడు చూసిన చెన్నూరుకు చాలా అభివృద్ధిలో తేడా ఉందని తెలిపారు. దానికి కారణం బాల్క సుమన్ అనే యువ నాయకుడు అని గర్వంగా చెబుతున్నానని తెలియజేశారు. బాల్క సుమన్ ఎమ్మెల్యేగా అయినప్పటి నుండి అహర్నిశలు కష్టపడుతూ చెన్నూరు ఒక మార్ముల ప్రాంతంగా ఉన్న నియోజకవర్గాన్ని ఒక మహా నగరంగా తీర్చిదిద్దిన ఘనత బాల్క సుమన్ కే దక్కుతుందని కొనియాడారు. ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం దొంగ పార్టీలు నాయకులు డబ్బు సంచులతో తిరుగుతున్నారని, డబ్బులకు మోసపూరిత మాటలకు ప్రజలు అవకాశం ఇవ్వకుండా అత్యధిక మెజారిటీతో బాల్క సుమన్ ని గెలిపించుకోవాల్సిన అవసరం, బాధ్యత చెన్నూరు ప్రజలపై ఉందని తెలియజేశారు.

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందింది అనేదానికి బలమైన కారణం కేసీఆర్ పరిపాలన విధానం, తెలంగాణ ప్రజలపై అభిమానమే కారణమని తెలిపార.అందుకే ప్రజలారా బిజెపి, కాంగ్రెస్ దొంగ పార్టీలకు ఓటు వేసి వారిని గెలిపించుకుంటే నష్టపోయేది మీరేనని, అలాంటి అవకాశం దొంగలకు ఇవ్వద్దని, ప్రజలకు ఆలోచించే శక్తి ఉంది కాబట్టి యువ నాయకుడు అయిన బాల్క సుమన్ కి ఓటు వేసి గెలిపించుకొని చెన్నూరు నియోజకవర్గాన్ని ఎంతో అత్యున్నత స్థాయి అభివృద్ధికి ప్రజలంతా వారి ఓటు హక్కును వినియోగించుకొని సహకరించాలని, ప్రజలంతా ముక్తకంఠంతో కెసిఆర్ ప్రభుత్వం రావాలని ఆకాంక్షించి కోరుతూ ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు, పట్టణ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.