Telugu Updates
Logo
Natyam ad

నేరాలకు పాల్పడితే జైలు శిక్ష తప్పదు

రామగుండం సీపీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల పెద్దపల్లి జోన్ గోదావరిఖని 1 టౌన్ మరియు రామగుండము పోలీస్ స్టేషన్ లలో నమోదైన 03 కేసులలో 04 గురు నిందితులని కోర్ట్ ముందు ఆధారల, సాక్షాలతో హాజరుపరచగా కోర్ట్ నిందితులకు  జీవితకాల శిక్ష మరియు పదిహేను 1500 రూపాయల జరిమానా కూడా విధించిందని రామగుండము పోలీస్ కమీషనర్ ఎం, శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ.. గత 07 నెలల కాలంలో జైలు శిక్ష మరియు జరిమానా విదించబడిన కేసుల వివరాలు గోదావరిఖని 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిదిలో వరకట్న హత్య కేసు లో ప్రేమించి, కులాంతర వివాహం చేసుకొని అదనపు కట్నం కోసం వేధించి గృహిణి హత్య కు కారణమైన గోదావరిఖని హన్మన్ నగర్ కు  చెందిన భర్త బిస్సా రాజు, అత్త బిస్సా దుర్గమ్మ ల కేసు విచారణ గురించి కొత్తకొండ శంకర్, కోర్ట్ డ్యూటీ ఆఫీసర్ కోర్ట్ లో 28 మందిని సాక్షులను ప్రవేశపెట్టగా అదనపు జిల్లా న్యాయ స్థాన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్  టీ. జ్యోతి రెడ్డి ప్రాసిక్యూషన్ తరపున తన వాదనలు వినిపించగ సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందుతులపై నేరం రుజువు కావటంతో ఇరువురుకి జీవిత ఖైదు విధిస్తూ గోదావరిఖని అదనపు జిల్లా న్యాయమూర్తి తీర్పునిచ్చారు. గోదావరిఖని 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిదిలో గుమ్మడి శ్రీకాంత్ s/o లేట్.  లక్ష్మణ్, హత్య, దొంగతనం నేరం చేసినట్లు  రుజువైనందున నేరస్థునికి జీవిత ఖైదు జైలు శిక్ష మరియు రూ 1000 రూపాయలు జరిమానా విధించారు. రామగుండము పోలీస్ స్టేషన్ పరిది రామగుండం ముబారక్ నగర్ చెందిన వృద్ధురాలు సమ్మెట బాలమ్మ అదే కాలనీకి చెందిన నగునూరి నరేష్, సమ్మెట తిరుపతిపై పాత కక్షలను దృష్టిలో పెట్టుకొన్న 2019 మార్చి ఒకటో తేదీన సమ్మెట తిరుపతి తల్లి బాలమ్మను గొడ్డలితో నరికి చంపివేశాడు. తిరుపతి పిర్యాదు. మేరకు అప్పటి ఎస్పై దత్తాత్రి కేసు నమోదు చేసి ఇన్స్పెక్టర్ స్వామి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసు విచారణ గురించి  కొత్తకొండ శంకర్, కోర్ట్ డ్యూటీ ఆఫీసర్ కోర్ట్ లో 14 మందిని సాక్షులను ప్రవేశపెట్టగా అదనపు జిల్లా న్యాయ స్థాన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్  టీ.జ్యోతి రెడ్డి ప్రాసిక్యూషన్ తరపున తన వాదనలు వినిపించగ సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందుతుడు నగునూరి నరేశ్ పై నేరం రుజువు కావడంతో జీవిత ఖైదు తోపాటు 500 రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు 2 కేసులలో నలుగురు నిందితులకు 4 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు 4600 జరిమానా విధించడం జరిగింది. 5 కేసులలో ఐదుగురు నిందితులకు 3 సంవత్సరముల కారాగారా శిక్ష మరియు 11200 రూపాయల జరిమానా కూడా విధించడం జరిగింది . 1 కేసులో ఒక నిందితుడికి రెండు సంవత్సరాల కారాగార శిక్ష విధించడం జరిగింది. కేసులో 1 నిందితుడికి రెండు సంవత్సరాల లోపు కారాగారా శిక్ష మరియు 200 జరిమానా విధించడం జరిగింది. 13 కేసులలో 23 మంది నిందితులకు 1 సంవత్సరం కారాగార శిక్ష మరియు తొమ్మిది వేల ఒక వంద రూపాయల జరిమానా కూడా విధించడం జరిగింది. 15 కేసులలో 23 మంది నిందితులకు సంవత్సరము లోపు కారాగార శిక్ష మరియు 3400 జరిమానా కూడా విధించడం జరిగింది. 09 కేసులలో 19 మంది నిందితులకు  29000 రూపాయల జరిమానా విధించడం జరిగింది. మొత్తం 49 కేసులలో 80 మంది నిందితులకు  జైలు శిక్షలు విదిస్తూ 59 వేల జరిమానా విధించడం జరిగిందని తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత ఆరు నెలలుగా 8208 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాగా కోర్టలో మందుబాబు లను హాజరు పరిచగా 1652 కేసులో 1652 మందికి 24,33,500 రూపాయల జరిమానా విధించడం జరిగింది అదేవిధంగా 11 మందికి జైలు శిక్ష విధించడం జరిగింది. ప్రస్తుత సాంకేతికతకు అనుగుణంగా పటిష్టంగా నూతన చట్టాలను ప్రభుత్వం రూపొందించిందని జులై 1వ తేదీ నుండి నూతన చట్టాల అమల్లోకి వచ్చినయి కావున ఎవరు కూడా నేరాలకు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి శిక్షలకు అర్హులు కాకూడదని సత్ప్రవర్తనతో మెలగాలని సిపి కోరారు.