Telugu Updates
Logo
Natyam ad

ఇంటర్ సెప్టర్ పోలీస్ వాహనం ప్రారంభం

ఇంటర్ సెప్టర్ వాహనాన్ని జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రారంభించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.

ఆంజనేయులు న్యూస్, రాజన్న సిరిసిల్ల జిల్లా: జిల్లాలో ఇంటర్ సెప్టర్ పోలీస్ వాహనాన్ని జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రారంభించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. ధర్నాలు, రాస్తారోకోలు జరిగే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన ఆ సంఘటనలను రికార్డు చేసే అధునాతన టెక్నాలజీ.. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణనే ప్రధాన ఉద్దేశ్యంతో ప్రజల్లో పోలీసు వ్యవస్థ పట్ల గౌరవం నమ్మకం మరింత పెరిగేలా జిల్లాలో మొట్టమొదటగా ఇంటర్సెస్టర్ పోలీస్ వాహనాన్ని ప్రారంభించామని, ఈ ఇంటర్ సెప్టర్ పోలీస్ వాహనం సిరిసిల్ల టౌన్, వేములవాడ టౌన్ లో నిత్యం తిరుగుతూ ర్యాలీలు, ధర్నాలు, అల్లర్లు జరిగినప్పుడు ఈ వాహనానికి ఉన్న 360°గలా కేమెరా తో రికార్డ్ చేసి ఉన్నత అధికారులకు తెలియజేస్తారు అన్నారు. ఇద్దరు డ్రిస్టిక్ గార్డ్ సిబ్బందితో ఉన్న ఈ వాహనం సిరిసిల్ల, వేములవాడ పట్టణంలో ప్రధాన కూడళ్లలో నిత్యం తిరుగుతూ శాంతి భద్రతలు పర్యవేక్షిస్తారు అని జిల్లా ఎస్పీ అన్నారు. ఎస్పీ వెంట ఆర్.ఐ రజినీకాంత్, టౌన్ సి.ఐ అనిల్ కుమార్ సిబ్బంది ఉన్నారు.