Telugu Updates
Logo
Natyam ad

రైల్వేస్టేషన్ లో అసాంఘిక కార్యకలాపాలు

ఆంజనేయులు న్యూస్, అదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ ఆకతాయిలకు అడ్డాగా మారింది. తాటిగూడ కాలనీ వైపు రైల్వే స్టేషన్ కు ప్రహరీ, కంచె లేక ఆ కాలనీవాసులతో పాటు పలువురు అటువైపున్న ప్లాట్ ఫామ్ పైనుంచే రాకపోకలు సాగిస్తుంటారు. తాటిగూడ కాలనీవాసుల రాకపోకల కోసం రైల్వే శాఖ, పురపాలక సంఘం ప్రత్యేకంగా రహదారిని నిర్మించాలి. కానీ అటువైపు ఎలాంటి రహదారి నిర్మించకపోవటంతో కాలనీవాసులు రాకపోకలకు రైల్వే ప్లాట్ ఫామ్ ను వాడుకుంటున్నారు. ఇదే అదనుగా మద్యం, గంజాయి తాగే వారు ఈ ప్లాట్ఫాంను తమ అసాంఘిక కార్యకలాపాలకు స్వేచ్ఛగా వినియోగించుకుంటున్నారు. ఈ ప్రాంతంలోనే కొందరు గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం. తాటిగూడ వైపు ఉన్న ప్లాట్ఫాంపై నిలిపి ఉంచే బోగీలే ఆకతాయిలకు అడ్డాగా మారుతున్నాయి. వీటి కిందనే కూర్చొని మద్యం, గంజాయి తాగుతున్నారు. రాత్రయితే చాలు ఆకతాయిలు అక్కడికి చేరుకుంటారు. పేకాట, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఆ వైపున కనీసం నిఘా కెమెరాలు సైతం లేవు. ప్రస్తుతం చలికాలం కావటంతో ఎవరైనా బోగీల వద్ద చలి <span;>మంట వేసుకుంటే అవి కాలిపోయే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆకతాయిలకు అడ్డు వేయాలని కోరుతున్నారు.