Telugu Updates
Logo
Natyam ad

స్కిల్ డెవలప్ మెంట్  ట్రైనింగ్ సెంటర్ ప్రారంభం

మందమర్రి జి.ఎం జి.దేవేందర్ 

ఆంజనేయులు న్యూస్, మందమర్రి: స్కిల్ డెవలప్ మెంట్  ట్రైనింగ్ సెంటర్ మంచిర్యాల జిల్లా మందమర్రి లో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జి.ఎం జి. దేవేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నాని స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ (ఎస్డిటిసి) అండర్ ఎస్.సి.సి.ఎల్ – సి.ఎస్.ఆర్ మందమర్రి ఏరియ, రీజినల్ డైరెక్టరేట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినుయర్షిప్ (RDSDE), హైదరాబాద్ వారి చే కంప్యూటర్ మరియు డి.టి.పి  కోర్సును జి.ఎం జి.దేవేందర్  ప్రారంభించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ జి.దేవేందర్ మాట్లాడుతూ.. కంప్యూటర్ డి.టి.పి  కోర్సును ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది అని వారు అన్నారు, ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి సూచనలమేరకు స్థానికంగా ఉండే నిరుద్యోగ యువతకు లబ్ధి చేకూర్చే దిశగా సింగరేణి కాలరీస్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లో భాగంగా ఒక సామాజిక బాధ్యతగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉందని వారు అన్నారు. కావున స్థానికంగా ఉండేటువంటి నిరుద్యోగ యువత ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్.ఓ.టు జి.ఎం రాజేశ్వర్ రెడ్డి, ఏ.ఐ.టీ.యూ.సీ మందమర్రి ఏరియ బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, డీ.జీ.ఎం ఈ అండ్ ఎం వై.వెంకటరమణ, శంకర్ GMVTC మేనేజర్, అశోక్ GMVTC అసిస్టెంట్ ట్రైనింగ్ మేనేజర్,బెంజిమెన్ కంప్యూటర్ శిక్షకులు, విద్యార్థులు పాల్గొన్నారు.