Telugu Updates
Logo
Natyam ad

గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం బెల్ట్ షాపులు

బెల్ట్ జోరు.. పల్లెల్లో బార్లను తలపిస్తున్న బెల్ట్ షాపులు

ఆంజనేయులు న్యూస్, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా: పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా మద్యం ఏరులై పారుతున్నా అటువైపు కన్నెత్తి చూడకుండా ఎక్సైజ్అధికారులు వ్యవవహరిస్తున్నారని ప్రజలంటున్నారు. పోలీసు అధికారులు కేవలం గుడుంబా స్థావరాలపైనే దృష్టి పెట్టడంతో పరోక్షంగా బెల్ట్ షాపుల నిర్వాహకులను పెంచి పోషించినట్లుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని జిల్లాలలో బెల్టు షాపుల దందా కిరాణా దుకాణం నుంచి మొదలుకొని నివాస గృహాలు, పాన్​ షాపుల వరకు మద్యం అమ్మకాల జోరు సాగుతూనే ఉంది. మండలాలలో కొన్ని గ్రామాల్లో పలువురు మద్యం వ్యాపారాన్ని ప్రధాన ఆదాయ వనరుగా ఎంచుకున్నారు. వైన్స్ మరియు బార్లకి ప్రత్యేక సమయం ఉండగా బెల్ట్ షాప్ లకి మాత్రం సమయపాలన లేక గ్రామాల్లో బెల్ట్‌ షాపుల ద్వారా రాత్రీ, పగలు తేడా లేకుండా బెల్ట్‌ షాపుల ద్వారా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు యథేచ్చగా సాగిస్తున్న సెబ్ అధికారులు దాడులు నిర్వహించడం లేదని పలువురు నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
విచ్చలవిడిగా పెరుగుతున్న బెల్ట్ షాపు నిర్వాహకులు ఎవరికి నచ్చిన విదంగా వారు ధర నిర్ణయించుకొని క్వార్టర్ పై 30/-రూ. లు, హాఫ్ పై 60/- రూ. లు ఫుల్ పై కనీసం 120/- రూ. లు బీర్ పై 50/-రూ.లు అదనంగా* వసూలు చేస్తున్నారు. వైన్ షాపుల్లో ఉండే ప్రతి ఒక బ్రాండ్ మద్యం బెల్ట్ షాపుల్లో ఉండటం గమనార్హం. ప్రతి ఒక్క గ్రామంలో గల్లీ గల్లీకి బెల్ట్ షాపులు వెలవటంలో ఆంతర్యమేంటో అర్థం కాని పరిస్థితి.
పుట్టగొడుగుల్లా బెల్ట్‌ దుకాణాలు వెలుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా బెల్టు షాపులు ఏర్పాటు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అధిక ధరలే కాకుండా ఖాతా బుక్ పెట్టి వడ్డీ వసూలు కూడా చేస్తున్నారూ అని వారి కుటుంబసభ్యులు వాపోతున్నారు దీనివలన అనేక మంది బెల్ట్‌ షాపుల్లో మద్యం కొనుగోలు చేసి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. అప్పులు చేసి తాగడం తో కాపురాలు వీధి పాలవుతున్నాయి. మరికొంత మంది కల్తీ మద్యంతో ప్రాణాలు కోల్పోతున్న దృష్ట్యాలు మనం చూస్తూనే ఉన్నాము. బెల్ట్‌షాపు లు, రెస్టారెంట్‌లలో మద్యం అమ్మకాలు జరగకుండా చర్యలు చేపట్టి మా కుటుంబాలు రోడ్డు పైన పడకుండా చూడాలని ఆయా గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు..