Telugu Updates
Logo
Natyam ad

నిస్సహాయ స్థితిలో ఉన్న కుటుంబానికి చేయూత,

డా. రాజా రమేష్ చెన్నూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధి

బియ్యం మరియు ఆర్ధిక సహాయం అందజేసిన డా. రాజా రమేష్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: చెన్నూర్ నియోజకవర్గంలో ని మందమర్రి మండలం 3వ జోన్ లో నివసిస్తున్న మేకల శ్రీనివాస్ కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగలేక పోవడం తో స్థానికులు కాంగ్రెస్ అభ్యర్ధి డా. రాజా రమేష్ కి తెలుపగా వెంటనే స్పందించి 50కిలోల బియ్యం మరియు ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా డా. రాజా రమేష్ మాట్లాడుతూ.. మందమర్రి లోని 3వ జోన్ కి చెందిన నిరుపేద కుటుంబం అయిన మేకల శ్రీనివాస్ వారి భార్య 2సంవత్సరాల కిందట గుండె జబ్బుతో చనిపోవడం, అలాగే మేకల శ్రీనివాస్ కాలు ఇన్ఫెక్షన్ తో కాలు తీసివేయడంతో జరిగింది వారికి ఎటువంటి వృత్తి చేయలేని పరిస్థితి ఉండడం,రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే పెన్షన్ కూడా రాక పోవడంతో ఎటువంటి సహాయం అందలేక నిస్సహాయ స్థితిలో ఉండడం తో మందమర్రి లోని ఏ పార్టీ నాయకులు కార్యకర్తలు పట్టించుకోక పోవడం తో స్థానికులు కాంగ్రెస్ అభ్యర్ధి డా. రాజా రమేష్ తెలుపగా వెంటనే స్పందించి 50 కిలోల బియ్యం, కొంత ఆర్ధిక సహాయం అలాగే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తోచినంత సహాయం అందిస్తాం అని మాట ఇవ్వడం జరిగింది. మేకల శ్రీను రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒకవేల పెన్షన్ రాలేకపోతే మేము అందరం కలిసి శ్రీను కు ఎంఆర్ఓ అఫిస్ లేదా కలెక్టర్ ఆఫీస్ కి వెళ్లి కచ్చితంగా పెన్షన్ వచ్చే లాగా చేస్తాం అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెన్నూర్ నియోజకవర్గంలోని మందమర్రి మండలం లో దాదాపుగా 800 మందికి పైగా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వారిని పట్టించుకోవట్లేదా, అర్థం చేసుకుంటలేరా నిర్లక్ష్యం చేస్తున్నారా అని సూటిగా ప్రశ్నించండం జరిగింది. ఈ కార్యక్రమంలో జీఎస్ఆర్ ఫౌండేషన్ మిత్ర బృందం కిరణ్ రమేష్, సురేష్, హరీష్, తిరుపతి, రాకేష్, శేఖర్, కృష్ణ, చిన్న, తదితరులు పాల్గొన్నారు..