Telugu Updates
Logo
Natyam ad

ఆలోచన అదిరింది.. ‘ప్రాంగణం’ మెరిసింది

గతంలో ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణంలో అపరిశుభ్ర వాతావరణం తాండవిస్తుండేది.నాడు’ బోథ్ మండల కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణం దుస్థితి

ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: గతంలో ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణంలో అపరిశుభ్ర వాతావరణం తాండవిస్తుండేది. పశువుల సంచారంతోపాటు ప్రైవేటు వాహనాలూ అక్కడే నిలిపేవారు. ప్రయాణికులు బస్టాండ్ లోకి వచ్చేందుకే ఇష్టపడేవారు కాదు. కానీ, ఒక్కరి కృషితో ఆ ప్రాంగణం సుందరంగా మారిపోయింది. ఆర్టీసీ కండక్టర్ గా పని చేస్తున్న గొల్లపల్లి సాయన్న విధుల్లో భాగంగా బోథ్ బస్టాండ్ కంట్రోలర్ గా మూడేళ్ల కిందట వచ్చారు. ప్రయాణికుల పాట్లను చూసి చలించిపోయిన ఆయన.. సోషల్ మీడియా సహకారంతో స్థానికులను చైతన్య పరిచారు. ఆర్టీసీ బోధ్ ప్రాంత ఉద్యోగులు, స్థానికుల నుంచే కాక తాను సైతం డబ్బులు వెచ్చించి.. ప్రాంగణానికి రంగులు వేయించారు. మరుగుదొడ్లను పంచాయతీ నిధులతో నిర్మించారు. దాతల తోడ్పాటుతో 76 సిమెంటు బల్లలు సమకూర్చారు. తల్లులు చంటి పిల్లలకు పాలు ఇచ్చేందుకు ప్రత్యేక గదిని సైతం నిర్మించారు. ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేవని సాయన్న ఆనందం వ్యక్తంచేస్తున్నారు.