Telugu Updates
Logo
Natyam ad

హెడ్ క్వార్టర్స్ లో పోలీస్ సిబ్బంది కి ఉచిత రక్త పరీక్షలు

ఆంజనేయులు న్యూస్, రామగుండం: రామగుండం పోలీస్ కమీషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో గోదావరిఖని సబ్ డివిజన్ సివిల్ పోలీస్, ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్ సిబ్బందికి శనివారం ఎస్ఆర్ఎల్ డైయాగ్నోస్టిక్ సర్వసెస్ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఉచిత రక్త పరీక్షలు నిర్వహించారు. ప్రతి ఏడాది ఒకసారైనా రక్త పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్య సమస్యలు లేకపోయనా రక్త పరీక్షలు చేయించుకోవడం మంచిదని, రక్తం శరీరంలోని అన్ని భాగాలకు వెళ్తుంది. కాబట్టి టెస్ట్ లు చేయడం వల్ల, శరీరంలో జరిగే ప్రతి చిన్న, పెద్ద విషయాన్ని గుర్తించవచ్చు, బ్లడ్ టెస్ట్ల ద్వారా శరీరంలో మనకు తెలియని ఇన్ఫెక్షన్లు, ఆరోగ్య సమస్యలు ఉంటే ప్రారంభ దశలోనే తెలుసుకోనీ ట్రీట్మెంట్ తీసుకునే ఆరోగ్యం కాపాడుకొనే అవకాశం ఉంటుందని రామగుండం సీపీ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి సిబ్బందికి తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ రూపేష్, డీసీపీ అడ్మిన్ అఖిల్ మహాజన్, గోదావరిఖని ఏసీపీ గిరి ప్రసాద్, ట్రాఫిక్ ఏసీపీ బాల రాజు, ఏఆర్ ఏసీపీ సుందర్ రావు, రామగుండం సీఐ లక్ష్మి నారాయణ, గోదావరిఖని టౌన్ సీఐ వేణు గోపాల్, ఆర్ఎస్ఐ లు శ్రీధర్, విష్ణు ప్రసాద్, ఎస్ఐ, ఆర్ఎస్ఐ, డాక్టర్స్ ఏం నాగిరెడ్డి ఎంఎస్ ఆర్థోపెడిక్, టివి రాజశేఖర్ రెడ్డి ఎండి ఫిజీషన్, స్వాతి డిజిఓ, డైయాగ్నోస్టిక్ సర్వసెస్ రమేష్, సిబ్బంది రమ్య, రాకేష్, నిరంజన్ పాల్గోన్నారు.