Telugu Updates
Logo
Natyam ad

ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం శిబిరాలు

మంచిర్యాల జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి.శేషాద్రి

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలో అర్హులైన దివ్యాంగులు ధృవీకరణ పత్రము పొందుటకు అక్టోబర్ 10వ తేదీ నుండి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నదరం శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి. శేషాద్రి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు మీ-సేవలో స్లాట్ బుక్ చేసుకొని నిర్ణీత తేదీలలో నగరం శిబిరంలో వైద్యులను సంప్రదించాలని, నూతనంగా నర్టిఫికెట్ పొందుటకు, పరిమిత కాలము ముగిసిన వారు రెన్యువల్ చేసుకోవాలని, ఒక రోజులో 50 మందిని పరీక్షించడం జరుగుతుందని తెలిపారు. మూగ, చెవుడు నమస్య ఉన్న వారికి అక్టోబర్ 10, నవంబర్ 3, డిసెంబర్ 1 తేదీలలో, శారీరక వికలాంగులకు (ఆర్థో) అక్టోబర్ 14, నవంబర్ 9, డిసెంబర్ 6 తేదీలలో, కంటి చూపు సమన్య గల వారికి అక్టోబర్ 21, నవంబర్ 25, డిసెంబర్ 22 తేదీలలో, మానసిక వికలాంగులకు అక్టోబర్ 27, నవంబర్ 29, డిసెంబర్ 30 తేదీలలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.