Telugu Updates
Logo
Natyam ad

గిరిపుత్రుల దాహం తీర్చలేని భగీరథ

ఆంజనేయులు న్యూస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా: పల్లె జనం గొంతెండుతోంది. గుక్కెడు నీటి కోసం వారి అవస్థలు వర్ణనాతీతం. బిందెలతో కిలోమీటర్ల మేర నడిచి వెళితే గాని దాహార్తి తీరని దుస్థితి. ఇలా ‘గిరి’ పుత్రులకు బావులు, వాగులే దిక్కవుతున్నాయి. మరోవైపు ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నా మంటున్న పాలకుల మాటలు ఆచరణలో కనిపించడం లేదు. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్యంతో ఉమ్మడి జిల్లాలోని పలు తండాలు, గూడేలకు ఇప్పటికీ మిషన్ భగీరథ నీరందడం లేదు. తిర్యాణి మండలంలోని గోవెన పంచాయతీ పరిధిలోని నాయకపు గూడలో మిషన్ భగీరథ పథకం పనిచేయడంలేదు. దీంతో గ్రామస్తులు కిలోమీటర్ దూరంలో ఉన్న వాగులోని చెలిమల నుంచి నీటిని తెచ్చుకుని దాహార్తి తీర్చుకుంటున్నారు.