Telugu Updates
Logo
Natyam ad

ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారిగా పని చేసిన డా॥ జి.సి. సుబ్బారాయుడు పదవీ విరమణ పొందినందున జిల్లా ఇన్చార్జ్ వైద్య-ఆరోగ్యశాఖ అధికారిగా నియమితులైన డా॥ అనిత బుధవారం జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులకు వివిధ రకాల వైద్య సేవల కొరకు వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. డా॥ అనిత జిల్లాలో జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ అధికారిగా, టీకాల అధికారిగా, ఆర్.బి.ఎస్.కె. ప్రోగ్రాం అధికారిగా పని చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సర్వేయలెన్స్ అధికారి డా॥ ఫయాజ్, మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.