Telugu Updates
Logo
Natyam ad

ఉద్యోగుల సమస్యలు పరిష్కారించాలని ధర్నా

సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: తెలంగాణ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం రోజున జిల్లా కేంద్రంలోని బస్టాండ్ నుండి పిడి కార్యాలయం వరకు ర్యాలీ అనంతరం పీడీ ఆఫీస్ ముట్టడి చేసి పీడీ కార్యాలయంలోని జిల్లా నోడల్ అధికారి హేమ సత్య కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా దుంపల రంజిత్ కుమార్ సిఐటియు జిల్లా కార్యదర్శి, భానుమతి అంగన్వాడి యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రంలో సోమార 70 వేల మంది అంగన్వాడీ ఉద్యోగులు  పని చేస్తున్నారు. విరంతా మహిళలు బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారు ఎక్కువ మంది ఉన్నారు. గత 40 సంవత్సరాలుగా పనిచేస్తూ పేద ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఆయన వీరికి కనీస వేతనం, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత, చట్టబద్ధ సౌకర్యాలు ప్రభుత్వం నేటికీ కల్పించలేదు. దీనివల్ల అంగన్వాడి ఉద్యోగులు చాలా నష్టపోతున్నారు.మన పక్కన ఉన్న తమిళనాడు, పాండిచ్చే రాష్ట్రాల్లో అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇచ్చారు. పశ్చిమ బెంగాల్, కేరళ తదితరాష్ట్రలో రిటర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్, పండగ బోనస్ తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారు. మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు అంగన్వాడీ ఉద్యోగులకు  కల్పించడం లేదు. అంగన్వాడి వర్కర్ పేరు టీచర్స్ గా మార్చారు. కానీ టీచర్ గా సమానంగా వేతనాలు ఇతర సౌకర్యాలు మాత్రం ఇవ్వడం లేదు. అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీల అమలు చేయాలని లేకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

ఈ కార్యక్రమంలో అబ్బోజు రమణ సీఐటీయు జిల్లా అధ్యక్షులు, రాజమణి జిల్లా అంగన్వాడీ యూనియన్ కార్యదర్శి,  శంకరమ్మ, అనురాధ, రాజేశ్వరి, మహేశ్వరీ, విరోనిక, చెంద్రకళ, పద్మావతి, సత్యవతి, శారదా, విజయలక్ష్మి, నిర్మల, గోమాస ప్రకాష్, దూలం శ్రీనివాస్, దాసరి రాజేశ్వరి,సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షలు, దేవదాస్ డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షలు, ముట్టడికి మద్దతుగా సంకె రవి సిపిఎం జిల్లా కార్యదర్శి, అశోక్ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.