దిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అభిషేక్ బోయినపల్లి.. ముత్తా గోపాలకృష్ణ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి గల కారణాలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు.
ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. మరోసారి ఈడీ అధికారులు బృందాలుగా ఏర్పడి జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, కూకట్ పల్లిలో సోదాలు నిర్వహిస్తున్నారు. ముత్తా గోపాలకృష్ణ కార్యాలయం, ఇంట్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ముత్తా గోపాలకృష్ణ వ్యాపారంలో అభిషేక్ బోయినపల్లి పెట్టుబడి పెట్టినట్టు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి ఈడీ అధికారులు కొంత సమాచారం సేకరించారు. జూబ్లీహిల్స్ లోనీ కార్యాలయంతో పాటు గచ్చిబౌలిలోని ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం 5.30గంటలకే ఈడీ అధికారులు ఇల్లు, కార్యాలయానికి చేరుకొని పలు పత్రాలను పరిశీలిస్తున్నారు. దిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అభిషేక్ బోయినపల్లి.. ముత్తా గోపాలకృష్ణ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న చెందిన రాబిన్ డిస్ట్రిబ్యూషన్స్ ఎల్ఎల్ పి లో అభిషేక్ బోయినపల్లి డైరెక్టర్ గా ఉన్నారు. మరో 8 కంపెనీల్లో కూడా అభిషేక్ డైరెక్టర్ గా ఉన్నట్టు తేల్చిన ఈడీ అధికారులు.. ఆయా కార్యాలయాల్లో ఇప్పటికే సోదాలు నిర్వహించారు. ఇందిరాపార్కు సమీపంలోని దోమలగూడలో ఉన్న గోరంట్ల సమీపంలోని దోమలగూడలో ఉన్న గోరంట్ల అసోసియేట్స్ లో నిర్వహించిన సోదాల్లోనూ ఈడీ అధికారులు కీలక సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. వీటి ఆధారంగా దర్యాప్తు నిర్వహిస్తున్న ఈడీ అధికారులకు అభిషేక్ కు సంబంధించిన పెట్టుబడులపై ఆరా తీస్తున్నారు. ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారనే విషయాలు తెలుసుకొని ప్రస్తుతం ఆయా సంస్థల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.