Telugu Updates
Logo
Natyam ad

భక్తులకు అసౌకర్యం కలగకుండా పూర్తిస్థాయి ఏర్పాట్లు

మంచిర్యాల కలెక్టర్ బాదావత్ సంతోష్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ఈనెల 18వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలోని నస్పూర్ మండలం సీతారాంపల్లి గ్రామంలోని గోదావరి తీరంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం నది తీరంలో జరుగుతున్న ఏర్పాట్లను ట్రైనీ కలెక్టర్ గౌతమితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పుణ్యస్నానం కోసం గోదావరి కి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని, తాత్కాలిక స్నానపు గదులు, మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక గదులు, వాహనాల పార్కింగ్, లైటింగ్, త్రాగునీరు ఇతరత్రా పూర్తి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. నది తీరం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు పొందోవస్తు ఏర్పాటు చేయడంతోపాటు గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్, తహసిల్దార్ జ్యోతి, నస్పూర్ ఎస్. ఐ. రవి, మున్సిపల్ చైర్ పర్సన్ ఈసంపల్లి ప్రభాకర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.