Telugu Updates
Logo
Natyam ad

అభివృద్ధి పనులను పూర్తి చేయాలి.

జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాహుల్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలోని మండలాలలో నిర్దేశించిన అభివృద్ధి పనులను 100 శాతం పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాహుల్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భావన సమావేశం మందిరంలో ట్రైనీ కలెక్టర్ పి. గౌతమి, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి బి. శేషాద్రి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నరేందర్ తో కలిసి మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు అభివృద్ధి పనుల నిర్వహణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మండలాలలోని గ్రామపంచాయతీలలో నిర్దేశించిన అభివృద్ధి పనులను పూర్తి స్థాయిలో సాధించాలని, గ్రామస్థాయి నుండి జరిగే విప్లవాత్మకమైన అభివృద్ధి పనులను గుర్తించి జిల్లాకు అపార్డు వచ్చే స్థాయిలో పనులు చేపట్టాలని తెలిపారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారులు సమన్వయంతో పని చేస్తూ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి, ఏ.పి.ఓ.లు, డి.ఎల్. పి.ఓ.లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.