Telugu Updates
Logo
Natyam ad

దశాబ్ది పేరుతో ప్రజల డబ్బు వృధా

దగా దశాబ్దికి రావణ వధ

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ నిధులు వెచ్చిస్తూ ,పార్టీ ప్రచార కార్యక్రమాలు చేపట్టడాన్ని నిరసిస్తూ గురువారం మంచిర్యాల లోని లక్ష్మీ థియేటర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దగ్ధం చేశారు.ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, పిసిసి సభ్యులు కొండ చంద్రశేఖర్ మాట్లాడుతూ దశాబ్ది అంటే దేశంలో ఎక్కడైనా పది సంవత్సరాలు అయితేనే దశాబ్ది కాలం అంటారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాల కాలం మాత్రమే అయిందని…కానీ బిఆర్ఎస్ ప్రభుత్వం రోజు అధికారిక లాంచనాలతో దశాబ్ది ఉత్సవాలు నిర్వహించడానికి గల కారణం రానున్న ఆరు నెలల్లో ఎన్నికలు ఉన్నాయని కావున దశాబ్ది ఉత్సవాల పేరుతో పార్టీ ప్రచారం చేసుకుని వందల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న విధానాన్ని తెలంగాణ ప్రజలకు తెలియజేయాలన్న ముఖ్య ఉద్దేశంతోటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు మంచిర్యాల లో కేసీఆర్ దిష్టి బొమ్మ  దగ్ధం చేయడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సిసెల్ జిల్లా అధ్యక్షుడు కౌన్సిలర్ రామగిరి భానేశ్, బిసి సెల్ అధ్యక్షుడు వడ్డె రాజమౌళి, మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు షేర్ పవన్, డిసిసి సభ్యులు ఆది సంజీవ్, సీనియర్ నాయకులు దాసరి లచ్చన్న, గట్టు స్వామి,ప్రకాష్,మోహన్ రెడ్డి, శ్రీరాముల తిరుపతి,తోట సంతోష్, శ్రావణ్, కుమార్, వొన్నోజుల శ్రీనివాస్, అజయ్, షకీల్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు..