Telugu Updates
Logo
Natyam ad

నేరా నియంత్రణ స్వీయ రక్షణ లో సీసీ కెమెరాల పాత్ర కీలకం

సిసి కెమెరాలను ప్రారంభించిన మంచిర్యాల పట్టణ సీఐ ముస్కె. రాజు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్ ఆదేశాల మేరకు, డీసీపీ మంచిర్యాల సుదీర్ కేకన్ ఐపిఎస్, ఉత్తర్వుల ప్రకారం మంచిర్యాల ఏసిపి పర్యవేక్షణలో మంచిర్యాల పట్టణ సిఐ ఎం.రాజు ఆధ్వర్యంలో  నేను సైతం మరియు కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం సప్తగిరి కాలని 2 లో సీసీ కెమెరాలను కాలని ప్రజలు  అందరూ కలిసి ఏర్పాటు చేసినారు. ఇట్టి సిసి కెమెరాలను మంచిర్యాల  సిఐ ఎం .రాజు ప్రారంభించినారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ.. సీసీ కెమెరాలు నేర నియంత్రణలో మరియు స్వీయ రక్షణకి చాలా ఉపయోగపడతాయని కావున ఈ విధంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతి కాలని లో ప్రజలు, వ్యాపారస్థులు, ప్రజా ప్రతినిధులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి  గ్రామ ప్రజలను ఆదర్శంగా తీసుకొని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని పట్టణాన్ని సురక్షితంగా, నేర రహిత పట్టణంగా ఉంచుకోగలరని సిఐ తెలిపారు..