Telugu Updates
Logo
Natyam ad

కలెక్టరేట్ ఎదుట ఆశా కార్యకర్తల ధర్నా

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి పట్టణంలోని షంశీర్ నగర్ యూపీహెచ్సీలో ఆశ వర్కర్లపై వేధింపులకు పాల్పడిన సూపర్వైజర్ మధును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో మంచిర్యాల కలెక్టరేట్ ముందు ఆశా కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. ఆశా వర్కర్లపై అధికారుల వేధింపులు అరికట్టాలని, భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా సూపర్ వైజర్ మధుపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమ్మక్కకు అధికారులు మెరుగైన వైద్యం అందించాలని, లేకుంటే  పోరాటం ఉదృతం చేస్తామని మరియు దండేపల్లి మండలం నర్సపూర్ గ్రామంలో రెండు నెలల క్రితం చనిపోయిన ఆశ వర్కర్ తీగల శ్యామల కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, శ్యామల కూతురును ఆశా వర్కర్ గా నియమించాలని  ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.

మహిళల పట్ల అసభ్య పదజాలంతో మాట్లాడి, చెడు మాటలతో తిట్టిన సూపర్వైజర్ ను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో  సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్, ఆశా యూనియన్ జిల్లా కార్యదర్శి శోభ, రాణి, నీరజ, కవిత, సునీత, సుజాత, నాగుబాయ్, విజయలక్ష్మి తదితరులు ఆశాలు పాల్గొన్నారు.