Telugu Updates
Logo
Natyam ad

ఈ మాసాంతంలోగా కలెక్టరేట్ ప్రారంభించేలా చర్యలు

రాష్ట్ర రవాణా, రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.ఎస్.శ్రీనివాసరాజు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: డిసెంబర్ మాసాంతంలోగా కలెక్టరేట్ ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణా, రోడ్లు-భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.ఎస్. శ్రీనివాసరాజు అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో నూతనంగా నిర్మితమవుతున్న కలెక్టరేట్ భవనంలో సమావేశ మందిరం, కలెక్టర్ చాంబర్, ఇతర నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి, రోడ్లు-భవనాల శాఖ ఈ.ఎన్.సి. గణపతిరెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రవాణా, రోడ్లు-భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ. కలెక్టరేట్ నిర్మాణ పనుల గుత్తేదారు నాగార్జున కన్స్ట్రక్షన్స్ ప్రతినిధులతో మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ నిర్మాణ పనులు 9 నెలలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయని, పనుల ప్రక్రియ వేగవంతం చేసి డిసెంబర్ మాసాంతంలోగా పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని, ఆ దిశగా అధికార యంత్రాంగం పర్యవేక్షించాలని తెలిపారు. పనులలో నాణ్యత పాటించాలని, అలసత్వం వహించరాదని, గుత్తేదారు పనులను అంతరాయం లేకుండా కొనసాగించాలని, సాంకేతికత సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.

భవన నిర్మాణం, హెలిప్యాడ్ ఇతరత్రా నిర్మాణాల సమయంలో భూ ఆక్రమణ అంశంపై కోర్టు ద్వారా పనులు నిలుపుదలపై ఆదేశాలు వచ్చినప్పుడు మాత్రమే పనులు ఆపివేయడం జరుగుతుందని, ఈ అంశంపై ఎవరైనా కోర్టుకు వెళ్ళినట్లయితే పనులు నిలుపుదల చేయమని కాదు అని తెలిపారు. డిసెంబర్ మాసాంతంలోగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, రోడ్లు-భవనాల శాఖ ఈ. ఈ. రాము, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.