Telugu Updates
Logo
Natyam ad

సిమెంట్ రింగు పై రక్షణ లేని విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌.

ప్రమాదం జరిగితే గాని పట్టించుకోరా.! పొంచి ఉన్న ప్రమాదం..!

పట్టించుకోని సంబంధిత అధికారులు

సిమెంట్ రింగు పై రక్షణ లేని విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌.

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: సిమెంట్  రింగు పై రక్షణ కంచెలేని ట్రాన్స్‌ఫార్మర్ తో ప్రమాదం పొంచి ఉంది. మంచిర్యాల జిల్లా, తాండూర్ మండలం కాసిపేట గ్రామంలో ఆటోస్టాండ్ సమీపంలో రహదారి ప్రక్కనే విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ప్రమాదభరితంగా ఉంది. ట్రాన్స్‌ఫార్మర్‌కు రక్షణ కంచె లేదు పైగా సిమెంట్ రింగ్ కుడా సిథిలావస్థలో కుంగిపోయి పడిపోయే స్థితిలో ఉంది. రింగ్ పడిపోకుండా గ్రామస్తులు కర్ర సహాయంతో ఉంచారు.. అది ఎప్పుడు పడిపోతదో కూడా తెలియని పరిస్థితి నెలకొన్నది. రక్షణ కంచ ఏర్పాటు చేయాల్సి ఉన్నా సంబంధిత అధికారులు ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. దీంతో ట్రాన్స్‌ఫార్మర్ కు పక్కనే నడిచి వెళ్ళే ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కూడలి ప్రదేశం కబట్టి గ్రామస్థులు రాకపోకలు సాగిస్తుంటారు. చిన్న పిల్లలు, మేకలు, గొర్రెలు ఆవులు, గడ్డి కోసం వెళ్లే ప్రమాదం ఉంది. దీంతో రోడ్డుగుండా వెళ్ళాలనుకునే వారికి ఎప్పుడు ఏమి జరుగుతుందోనని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగితే గాని పట్టించుకోరా అని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఇప్పటికైనా విద్యుత్‌ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్పందించి ట్రాన్స్‌ఫార్మర్ కు రక్షణ కవచాలు ఏర్పాటు చేసి ట్రాన్స్‌ఫార్మర్ ను సురక్షితమైన ప్రదేశంలో ఉంచి కంచె ఏర్పాటు చేయాలని గ్రామీణ ప్రజలు కోరుతున్నారు.