Telugu Updates
Logo
Natyam ad

కేసుల దర్యాప్తులో మరింత నాణ్యత పాటించాలి: జిల్లా ఎస్పీ

ఆంజనేయులు న్యూస్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా: జిల్లాలో ఆయా పోలీస్ స్టేషన్ లలో నమోదు అయి పెండింగ్ లో ఉన్న కేసులలో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ను పెంపొందించి సత్వర పరిష్కారంకు బాధ్యతగా కృషి చేయాలని జిల్లా ఎస్పీ కే. సురేష్ కుమార్ ఐపిఎస్ పోలీస్ అధికారులకు సూచించారు. మంగళవారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా ఎస్పీ నెలవారీ నేరసమీక్ష సమావేశం నిర్వహించి ఓల్డ్ యు. ఐ, గ్రేవ్ కేసులు, ఎస్సీ, ఎస్టీ కేసులు, కాంటెస్టెడ్ కేసులపై రివ్యూ నిర్వహించారు. నమోదు అయిన కేసులలో శిక్షల శాతంను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించడం జరిగింది. పెండింగ్ ఉన్న (అండర్ ఇన్వెస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల గురించి పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధిలో పెండింగ్ లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి పోలీసు అధికారులందరూ న్యాయధికారులతో సమన్వయం పాటిస్తూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. పెండింగ్ కేసులను పూర్తిస్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి, డిస్పోజల్ చేయాలని సూచించారు. పోక్సో, ఎస్సీ ఎస్టీ కేసులలో 60 రోజుల్లో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేయాలి, రౌడీలు, కేడీలు, సస్పెక్ట్ ల యొక్క కదలికలపై నిరంతరం నిఘాపెట్టాలి. ప్రతి కేసులో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలన్నారు.

సైబర్ నేరాల్లో త్వరితగతిన పరిశోధన పూర్తి చేయాలన్నారు. టార్గెట్ పెట్టుకొని పెండింగ్ ఉన్న కేసులను తగ్గించాలన్నారు. దొంగతనాల కేసుల్లో ప్రతిరోజు కేసు చేధన గురించి అన్ని కోణాల్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఎస్ఓపి ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి కేసులు ఛేదించాలని సూచించారు. ఈపెట్టి కేసులు వెంటనే డిస్పోజల్ చేయాలని సూచించారు. ఎన్ఫోర్స్మెంట్ వర్క్ పై దృష్టి సారించాలి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా వాహనాల తనిఖీలు నిర్వహించాలని తెలిపారు.