Telugu Updates
Logo
Natyam ad

కార్డెన్ సెర్చ్,. వంజిరి గ్రామాన్ని జల్లెడ పట్టిన పోలీసులు

ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: కాగజ్నగర్ డీఎస్పీ కరుణాకర్, రూరల్ సీఐ నాగరాజ్ నేతృత్వంలో శనివారం కాగజ్నగర్ మండలం వంజిరి గ్రామ పంచాయతీలో గల మన్నేవారు, బెస్తవారు వాడల్లో పోలిసులు కార్డెన్ సెర్చ్ ఆకస్మికంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వంజిరిలోని గల్లీ గల్లీని పోలీసులు జల్లెడ పట్టినట్లు తనిఖీలు చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ… తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రోత్సహించొద్దని హెచ్చరించారు. గ్రామాల్లోని సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. యువత వాహనాలను పరిమిత వేగంలో వెళ్లి, ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని సూచనలు చేశారు. కార్డెన్ సెర్చ్ లో భాగంగా సరైన పత్రాలు లేని 25 బైకులకు చలాన్లు విధించారు. 25 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్డెన్ సెర్చ్ రూరల్ ఎస్ఐ సోనియా, కానిస్టేబుళ్లు, సిబ్బంది పాల్గొన్నారు.