Telugu Updates
Logo
Natyam ad

బెల్లంపల్లి సబ్ డివిజన్ అధికారులతో సీపీ సమీక్ష

నేరస్తులకు శిక్ష పడే విధంగా పనిచేయాలి

పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్, ఐపిఎస్.

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ఇన్వెస్టిగేషన్ పూర్తి ఆధారాలతో, పారదర్శకతతో చేసి నేరస్తులకు శిక్ష పడే విధంగా పనిచేయాలని రామగుండం సిపి శ్రీనివాస్ అన్నారు బెల్లంపల్లి సబ్ డివిజన్ అధికారులతో ఆయన కమిషనరేట్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న కేసులను త్వరగా డిస్పోస్ చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో త్వరగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జీ షీట్ దాఖలు చేయాలన్నారు. ప్రతి ఫైల్ లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం సిడి ఫైల్ పొందుపరచాలని తెలిపారు.  ప్రజలతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని సీపీ అధికారులకు సూచించారు. ప్రతి నేరస్థునికి శిక్ష పడేలా కేసులను పక్కా ఆధారాలతో నమోదు చేయాలని సూచించారు. నేరాల నియంత్రణకు విసబుల్ పోలీసింగ్, నిరంతర పెట్రోలింగ్ తో పాటు సాంకేతిక వ్యవస్థ కూడా  ఉపయోగించుకోవాలన్నారు. పెట్రోల్ కార్ నిరంతరం 24 గంటలు గస్తీ నిర్వహిస్తూ, ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో వుంటూ ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించి డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించి, ప్రజల సమస్యలను చట్టపరిదిలో తీర్చాలని, ప్రజావాణి ద్వారా వచ్చిన పిటిషన్ లు త్వరితగతిన విచారణ జరిపి చట్ట పరిధిలో బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై  ప్రత్యేక నిఘా పెట్టాలి. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పాన్ షాప్స్, కిరాణం షాప్స్, స్కూల్స్, కాలేజీ ల వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి. గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాల విక్రయాలతో పాటు రవాణాకు పాల్పడుతున్న వారిపై నజరు పెట్టాలని, కేసులు నమోదు చేయాలని సిపి అధికారులకు సూచించారు.

ఈ సమావేశం లో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, బెల్లంపల్లి ఎసిపి రవి కుమార్ ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు , బెల్లంపల్లి సబ్ డివిజన్ సీఐ లు, సిసి ఆర్ బి ఇన్స్పెక్టర్ బుద్దె స్వామి, ఎస్ఐ లు పాల్గొన్నారు.