Telugu Updates
Logo
Natyam ad

ఆయుర్వేద చికిత్స.. ఎవరికైనా తెలిస్తే చెప్పండి: మోదీ

మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్ పేయీ గొప్ప రాజనీతిజ్ఞుడని మోదీ అన్నారు. దేశానికి ఆయన అసాధారణమైన నాయకత్వాన్ని అందించారన్నారు.

ఆంజనేయులు న్యూస్, దిల్లీ: విదేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయీ జయంతి రోజున ప్రజలతో మాట్లాడటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మన్కీ బాత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ. వచ్చే ఏడాది జీ-20 సమావేశాలకు ఆతిథ్యం ఇవ్వడంతోపాటు యోగా, ఆయుర్వేదం తదితర అంశాలను ప్రస్తావించారు. వచ్చే ఏడాది జీ-20 (G 20) సమావేశాలకు భారత్ ఆతిథ్యం ఇవ్వడాన్ని ఎంతో గొప్పగా భావిస్తున్నానని మోదీ పునరుద్ఘాటించారు. సత్యానికి సాక్ష్యం అవసరం లేదన్న నానుడిని ప్రస్తావిస్తూ.. ప్రత్యక్షంగా చూసిన దానికి కూడా ఎలాంటి ఆధారం అవసరం లేదన్నారు. కానీ, ఆధునిక వైద్య శాస్త్రంలో మాత్రం ఆధారాలకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. భారతీయ పరిశోధనలకు ఇదే పెద్ద సవాల్ గా మారిందన్నారు. అయితే, క్రమంగా పరిస్థితులు మారుతున్నాయని శ్రోతలకు మోదీ వివరించారు. ఈ సందర్భంగా ముంబయిలోని టాటా మెమోరియల్ కేంద్రాన్ని ప్రశంసించారు. ఈ పరిశోధన కేంద్రం చేసిన అధ్యయనంలో రొమ్ము క్యాన్సర్ నివారణలో యోగా మంచి ప్రభావం చూపిస్తుందని తేలిందని గుర్తు చేశారు. కానీ, దీనికి శాస్త్రీయ ఆధార లేదని అన్నారు.